దర్శక, నిర్మాత విజయ బాపినీడు కన్నుమూత
ప్రముఖ దర్శకుడు, నిర్మాత విజయ బాపినీడు నేటి ఉదయం మృతి చెందారు. అనారోగ్య కారణంతో ఆయన ఈ ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. 1936 సెప్టెంబర్ 22న చాటపర్రులో జన్మించిన బాపినీడు ఎన్నో హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన అసలు పేరు గుట్టా బాపినీడు చౌదరి. ఇండస్ట్రీకి వచ్చిన తరువాత తన పేరును విజయ బాపినీడుగా మార్చుకున్నారు. ఏలూరులోని సీఆర్ఆర్ కళాశాలలో బీఏ వరకు చదివి కొంతకాలం వైద్యారోగ్య శాఖలో పనిచేశారు. గుత్తా బాపినీడు పేరుతో పలు రచనలు చేశారు. మద్రాస్‌లో బొమ్మరిల్లు, విజయ మాస పత్రికలను ప్రారంభించారు. తన కుమార్తెలు నిర్మించిన ‘కొడుకులు’ చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారు. బాపినీడు ఎక్కువగా మెగాస్టార్ చిరంజీవితోనే సినిమాలు రూపొందించారు.













