గురువు మార్గంలోనే శిష్యుడు కూడా!
డైరెక్టర్ త్రివిక్రమ్ దగ్గర ఎంతో మంది అసిస్టెంట్ డైరెక్టర్లుగా పని చేశారు. కానీ త్రివిక్రమ్ శిష్యుడిగా సినిమా తీసి, తనను తను ప్రూవ్ చేసుకుని క్లిక్ అయింది మాత్రం వెంకీ కుడుములనే. తన మొదటి సినిమా ఛలో తో మంచి డైరెక్టర్ అని పేరు తెచ్చుకున్నాడు వెంకీ. ఛలో ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు వచ్చి ఛలో హిట్ కొట్టు అంటూ వెంకీకి ఎనర్జీని ఇచ్చాడు త్రివిక్రమ్.
ఆ ఈవెంట్‌తోనే వెంకీ త్రివిక్రమ్ దగ్గర వర్క్ చేశాడని అందరికీ తెలిసింది. ఆ తర్వాత వెంకీ తెరకెక్కించిన భీష్మ సినిమాలో కూడా త్రివిక్రమ్ మార్క్ బాగా కనిపిస్తుంది. మేకింగ్ లోనే కాదు, వీరిద్దరికీ మరో విషయంలో కూడా చాలా దగ్గర పోలిక కుదిరింది. ఒకే హీరోయిన్‌తో మూడు సినిమాలు చేస్తూ రిపీట్ చేయడం వీరిద్దరిలో కనిపించే కామన్ క్వాలిటీ.
అరవింద సమేత నుంచి ఇప్పుడు మహేష్ తో చేస్తున్న సినిమా వరకు వరుసగా పూజా హెగ్డేనే హీరోయిన్ గా రిపీట్ చేస్తున్నాడు త్రివిక్రమ్. ఇప్పుడు అదే దారిలో వెంకీ కూడా ఒకే హీరోయిన్‌తో మూడు సినిమాలు చేస్తు్నాడు. ప్రస్తుతం వెంకీ కుడుముల నితిన్‌తో మరో అడ్వెంచర్ థ్రిల్లర్‌ను ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్గా ఇప్పటికే అనౌన్స్మెంట్ వచ్చింది.
వెంకీ ఇప్పటివరకు తెరకెక్కించిన ఛలో, భీష్మ సినిమాల్లో రష్మికనే హీరోయిన్. తెలుగులో రష్మికను ఇంట్రడ్యూస్ చేసింది కూడా వెంకీనే. ఆ గౌరవంతోనే రష్మిక ఇప్పుడు పెద్ద హీరోయిన్ అయినప్పటికీ తన డేట్స్ ని అడ్జస్ట్ చేసుకుందని టాక్. ఏదేతే ఏంటి గురువు మార్గంలోనే ఇలా ఒకే హీరోయిన్ను రిపీట్ చేస్తూ
ముందుకు దూసుకెళ్తున్నాడు వెంకీ కుడుముల.













