హీరోలపై కంచరపాలెం డైరెక్టర్ సెటైర్లు
కేరాఫ్ కంచరపాలెం సినిమాతో అందరినీ ఇంప్రెస్ చేసిన వెంకటేష్ మహా ఆ తర్వాత రెండో సినిమాగా ఉమామహశ్వర ఉగ్రరూపస్య సినిమా చేశాడు. ఈ సినిమా రీమేక్ అయినప్పటికీ వెంకటేష్ దాన్ని డీల్ చేసిన విధానానికి అందరూ ఆశ్చర్యపోయారు. తన నుంచి మరెన్నో సినిమాలను ఆడియన్స్ ఆశించినప్పటికీ తను మాత్రం చాలా గ్యాప్ తీసుకున్నాడు.
మధ్యలో మర్మాణువు అనే సినిమా చేస్తున్నట్లు అనౌన్స్ చేశాడు కానీ దాని అప్డేట్స్ ఏమీ తర్వాత లేవు. అయితే వెంకటేష్ డైరెక్టర్ గానే కాకుండా క్రియేటివ్ ప్రొడ్యూసర్గా కూడా వ్యవహరిస్తుంటాడు. రీసెంట్గా ఆయన క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన మార్టిన్ లూథర్ కింగ్ ప్రమోషన్స్ లో వెంకటేష్ కు డైరెక్టర్ గా కెరీర్ లో చాలా గ్యాప్ వచ్చిందన్న విషయంపై మాట్లాడాడు.
తాను ఎంతో మంది హీరోలకు కథలు చెప్పానని, కానీ అవేమీ పట్టాలెక్కట్లేదని చెప్పుకొచ్చాడు వెంకటేష్. ఓ ప్రముఖ హీరోకి లవ్ స్టోరీ చెప్తే, తాను పుష్ప లాంటి కథ కావాలన్నాడని, మరో హీరోకు ఇంకో కథ చెప్తే ఆయన కేజీఎఫ్ తరహాలో స్టోరీని మార్చాలని చెప్పారని అన్నాడు. అందరూ పుష్ప, కేజీఎఫ్ లాంటి సినిమాలే చేయాలంటే, ఆ సినిమాల్లో తమ ముఖాలను ఏఐ ద్వారా మార్చి చూసుకుంటే సరిపోతుంది కదా అని ఆ హీరోలపై సెటైర్స్ వేస్తూనే తన కెరీర్ గ్యాప్ కు రీజన్ చెప్పాడు వెంకటేష్.













