కస్టడీ నాగ్ తో చేయాల్సింది : వెంకట్ ప్రభు
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున గతంలో బహు భాషా దర్శకులతో పని చేశాడు. తమిళ దర్శకులు కూడా ఆయనతో పనిచేశారు. ఇదే కోవలో వెంకట్ ప్రభు సైతం నాగ్‌తో ఓ మూవీ చేయాలనుకున్నారట. ప్రస్తుతం నాగ్ కొడుకు నాగచైతన్యతో ఆయన కస్టడీ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ సినిమా నాగ్ చేయాల్సిందట. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా క్యాన్సిల్ అయి ఆఖరికి చైతూతో చేశాడు. దాని గురించి వెంకట్ ప్రభు మీడియాకు వివరిస్తూ, నేను తెలుగులో నేరుగా ఓ సినిమా చేయాలని ఎప్పట్నుంచో ప్రయత్నిస్తున్నాను. కానీ కుదరడం లేదు. అజిత్ గారితో తీసిన మన్కాతా సినిమాను తెలుగులో సమాంతరంగా నాగార్జున గారితో చేయడానికి సంప్రదింపులు జరిగాయి. కానీ కొన్ని కారణాలతో అది కుదరలేదు.
తర్వాత మానాడు సినిమాను కూడా ఒకేసారి తెలుగులో వేరే హీరోగా చేయాలనుకున్నా అది కూడా వీలుపడలేదని, మొత్తానికి ఇప్పుడు కస్టడీ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నట్లు వెంకట్ ప్రభు చెప్పుకొచ్చాడు. అయినా సరే కస్టడీకి చైతూ మంచి ఛాయిస్ అని, ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల మన్ననలను పొందుతుందని వెంకట్ ప్రభు తెలిపాడు.













