బ్రో ఈవెంట్లో వారి స్పీచ్‌లు మిస్ అయ్యారుగా
బ్రో రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. అంతా బానే ఉంది కానీ ఈ ఈవెంట్ కు వస్తారనుకున్న బండ్ల గణేష్ రాకపోవడంతో ఫ్యాన్స్ అసంతృప్తి చెందారు. పవర్ స్టార్ గురించి ఒళ్ళు గగుర్పొడిచేలా మాట్లాడాలంటే బండ్ల తర్వాతే ఎవరి వల్లనైనా అవుతుంది. ఆ రేంజ్ లో పవన్ ను ఎలివేట్ చేస్తాడు బండ్ల గణేష్.
సరే బండ్ల గణేష్ చేసే మాస్ ఎలివేషన్స్ మిస్ అయ్యాయి, త్రివిక్రమ్ క్లాస్ స్పీచ్ అయినా ఉంటుందనుకుంటే అదీ లేదు. బ్రో ఈవెంట్ కు త్రివిక్రమ్ కూడా రాలేదు. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, డైలాగ్ రైటర్ గా ఉన్న త్రివిక్రమ్ ప్రమోషన్లలో మాత్రం పాల్గొనడం లేదు. అసలే గుంటూరు కారం సినిమా హడావిడిలో ఉన్న త్రివిక్రమ్ ఇప్పుడు తన ఫోకస్ అంతా దానిపైనే పెట్టినట్లున్నాడు.
మహేష్ లేని చైల్డ్ ఎపిసోడ్స్‌ని షూట్ చేస్తున్న త్రివిక్రమ్, అందుకే బ్రో ఈవెంట్ కు రాలేదని తెలుస్తోంది. అంతే కాదు త్రివిక్రమ్ వస్తే ఆ ఈవెంట్లో ఆయనే ఎక్కువ హైలైట్ అయ్యే ఛాన్సుంది కాబట్టి అసలు ఈవెంట్ కు వెళ్లకపోతే ఏ బాధా ఉండదని త్రివిక్రమ్ భావించాడట. త్రివిక్రమ్ ఈవెంట్‌కు రాకపోయినా తన స్నేహితుడి గురించి పవన్ ఓ రేంజ్ లో ఎలివేషన్స్ ఇచ్చాడు కాబట్టి త్రివిక్రమ్ వచ్చినట్లే అనిపించింది. మొత్తానికి బ్రో ఈవెంట్ లో బండ్ల మాస్ స్పీచ్, త్రివిక్రమ్ క్లాస్ స్పీచ్ ను ఫ్యాన్స్ మిస్ అయిపోయారు.













