కురుక్షేత్ర యుద్ధం తరువాత కూడా ఎమోషన్ తో కూడుకున్న కథ వుంది – త్రివిక్రమ్ శ్రీనివాస్
మాటలతో ప్రేక్షకుల్ని, కథలతో స్టార్ హీరోల్ని, మంత్ర ముగ్ధుల్ని చేసే దర్శక రచయిత ఎవరంటే టక్కున గుర్తుకు వచ్చేది త్రివిక్రమ్ శ్రీనివాస్. అతనితో సినిమా చేయడానికి నిర్మాతలు … మళ్లీ మళ్లీ పనిచేయడానికి హీరోలంతా ఎదురుచూస్తుంటారు. అదే మరి త్రివిక్రమ్ మ్యాజిక్ అంటే. అందుకే అజ్ఞాతవాసి లాంటి ఫ్లాప్ తరవాత కూడా త్రివిక్రమ్ నుంచి ఓ సినిమా వస్తోందంటే ప్రేక్షకుల్లో ఓ అటెన్షన్…యంగ్ టైగర్ ఎన్టీర్ హీరోగా `అరవింద సమేత` గురువారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సంద్భంగా త్రివిక్రమ్‌తో చేసిన ఇంటర్వ్యూ విశేషాలు.
ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఒకే ఒక మాట మాట్లాడి, స్టేజి దిగిపోయారు పెద్దగా మాట్లాడలేదు… కారణాలేమైనా ఉన్నాయా?
ప్రత్యేకించి ఏం లేవు. ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో చాలా అయోమయంలో వున్నాను. హరికృష్ణ గారి మరణం అందరి మనసుల్లో ఉండిపోయింది. నేను ఏం మాట్లాడిన దాంతోనే ముగించాలి. అందుకనే ఎక్కువగా మాట్లాడకుండా ఎన్టీఆర్ కు వదిలేశా. ఆ సమయంలో ఏం మాట్లాడినా టాపిక్ మరింత భారమైపోతుందనిపించింది. అప్పటికే ఆక్కడ మూడ్ అంతా గంభీరంగా మారిపోయింది. ఇక నేను ఏం మాట్లాడిన ఇంకా ఎక్కువవుతుందని అందుకే మాట్లాడలేకపోయాను.
హరికృష్ణ గారి మరణం తో మీరు ముందుగా అనుకున్నట్లుగా సినీ ప్రముఖులు దసరాకి సినిమా వస్తుందనుకోలేదు అన్నారు అనుకున్నట్టుగానే దసరాకు వచ్చేసింది..
ఎన్టీఆర్ అంత విషాదంలో ఉన్నప్పుడు `షూటింగ్‌కి రాగలరా` అని అడగడానికి ధైర్యం కావాలి కదా?
అందుకే అడగలేదండీ. కానీ రెండో రోజు సాయింత్రం ఫోన్ చేసి ఎన్టీఆర్ `రేపు షూటింగ్‌కి వస్తున్నా.. అన్నీ రెడీ చేసుకోండి` ఆయన మాటలు విని షాక్ అయ్యాం. అని చెప్పి మాకు ధైర్యం ఇచ్చారు. నిజానికి రిలీజ్ అవుతుందా? లేదా? అనుకున్న సమయానికి ఈ సినిమాని తీసుకొస్తామా లేదా? అనే టెన్షన్ ఏమీ పడలేదు. అక్టోబరు 11ని మైండ్‌లోంచి తీసేశాం. అయితే ఫిబ్రవరి, లేదంటే సమ్మర్‌కి ఈసినిమా తీసుకొద్దామనుకున్నాం. ఎన్టీఆర్ ధైర్యంగా తన దుక్కాన్ని తనలోనే దిగమింగుకుని ఆ స్టెప్ తీసుకోవడం వల్లే.. ఇప్పుడు విడుదల చేసే అవకాశం దక్కింది.
రం.. రుధిరం… అనే పాట హరికృష్ణ మరణం తరవాతే తీశార్ట కదా..?
అదే దురదృష్టం. మేం చేయాల్సిన షాట్లు అవే మిగిలాయి. అంత విషాదంలోనూ ఎన్టీఆర్ ఆ సన్నివేశాల్ని చేసేశారు. ఈ నెల రోజులూ త్రివిక్రమ్ చాలా ధైర్యం ఇచ్చారు అని ఎన్టీఆర్ అన్నారు. అది ఆయన గొప్పదనం. నిజానికి మా అందరికీ ధైర్యం చెప్పింది ఎన్టీఆరే.
ఎన్టీఆర్‌తో పన్నేండేళ్ల అనుబంధం.. వుంది మీకు మరి ఆయనతో సినిమా చేయడానికి ఇంత కాలం పట్టిందెందుకు?
అనుకున్నాం గానీ కుదరలేదు. నాన్నకు ప్రేమతో సమయంలో మాత్రం ఈసారి గట్టిగా అనుకున్నాం. ఈసారి చేయాల్సిందే అని. మూడు కథలు డిస్కర్షన్ చేశాం. అందులో `అరవింద సమేత` కథ మా ఇద్దరికి బాగా నచ్చింది.
గత ఇరవై ఏళ్లుగా ఫ్యాక్షన్ నేపథ్యంలో చాలా సినిమాలొచ్చాయి ఈ మధ్య కాలం లో అసలు ఆ జోనరే ముట్టుకోవడం లేదు. కానీ మళ్లీ మీరు ఆ ధైర్యం చేశారెందుకు?
ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన సినిమాలు నేనూ చూశాను. ఎన్టీర్ బ్లాక్ బస్టర్ మూవీ ఆది కూడా ఫ్యాక్షన్ నేపథ్యంలో తీసింది. చిరంజీవిగారు బాలకృష్ణ గారు వెంకటేష్ వంటి స్టార్ హీరో ఇంకా ఎందరో హీరోలు చేసారు అవి బాక్స్ ఆఫీస్ హిట్స్ సాధించాయి అయితే హింస, హీరోయిజం… ఇవన్నీ మనకు బాగా కిక్ ఇచ్చాయి. ఆ తరవాత పరిస్థితేంటన్నది ఎవరూ చెప్పలేదు. మహాభారతంలో కూడా యుద్దాల గురించి చెప్పి, తరవాత విషయాలు పెద్దగా చర్చించడానికి ఒప్పుకోరు. దానికి గల కారణం.. అవేం పెద్దగా కిక్ ఇవ్వవు. యువతరానికి జీవితం పట్ల ఉన్న ఆశని అవన్నీ చంపేస్తాయి. ఫ్యాక్షన్ కథలూ అంతే. ఫ్యాక్షన్ వల్ల చితికి పోయిన జీవితాల గురించి, మాంగళ్యం పోగొట్టుకున్న భార్యల గురించీ మాట్లాడుకోరు. వాటిని ఈ సినిమాలో చూపిస్తున్నాం. నిజానికి ఈ పాయింటే.. ఎన్టీఆర్‌కి బాగా నచ్చింది.
గతం లో పవన్ కళ్యాణ్ తో కోబలి అనే కథను సిద్ధం చేసారు కదా ఆ కథయేనా ఇది?
కోబలి కధకు అరవింద సమేత చిత్రాలకు ఎక్కడా పోలిక లేదు చాలా మంది ఇదే ప్రశ్న అడిగారు. పవన్ కళ్యాణ్ తో తీద్దామనుకున్న కోబలి చిత్రానికి, ఈసినిమాకి సంబంధం లేదు. ఆ కదా హాలీవుడ్ టైపు లో ఒకే జోనర్ తో సాగే చిత్రం అది మెయిన్ కంటెంట్ డైరెక్టుగా చెప్పగలిగే మూవీ. అరవింద సమేత ప్రేక్షకులు అభిమానులు కోరుకునే అన్ని అంశాలతో పాటు ఎమోషన్స్ తో సాలిడ్ గా ఉంటుంది ఈచిత్రం.
ఎన్టీఆర్ చేసిన గత చిత్రాలకూ ఈ సినిమాలో అతని నటనకు ఉన్న తేడా ఏమిటి?
గత సినిమాల్లో కనిపించని కోణం ఇందులో ఉంటుంది. అతని బలాల్ని వాడుకుంటూనే, పాత చిత్రాల ఛాయలు కనిపించకుండా చూడడానికే ప్రయత్నించా. అయితే పెద్ద పెద్ద మార్పులు కూడా అవసరం లేదండీ. అభిమానులకు రిజిస్టర్ అయ్యేలా చిన్న మార్పులు చూపించినా.. అవి బాగా పండుతాయి.
పెనీవిటి సాంగ్ బాగా ఆదరణ పొందింది..
పెనీవిటి సాంగ్ ను 40శాతం మాత్రమే ఎన్టీఆర్ పైన చిత్రీకరించాం. మిగితా అంత కొండలు మిగితా ప్రదేశాలపై షూట్ చూశాం. సినిమాలో ఈసాంగ్ ను చూసేటప్పుడు ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అవుతారు.
మ్యూజిక్ డైరెక్టర్ గా ముందు అనిరుధ్‌ని అనుకున్నారు కదా, అతన్ని పక్కన పెట్టడానికి కారణం?
తనకు తెలుగు సినిమా సంగీతం అర్థం కావడానికి, నాకు అనిరుధ్ అర్థం కావడానికి కొంత సమయం పడుతుందనిపించింది. `ఈ సినిమాకి వద్దులే… `అనుకుని తమన్‌ని తీసుకున్నా. పక్కన పెట్టలేదండీ. ఇప్పటికీ మేం టచ్‌లో ఉంటాం. నాకు నేను కొత్తగా కనుక్కునే ప్రయాణంలో మిగిలిన వాళ్లతో జర్నీ చేస్తుంటా. అంతే తప్ప.. ఇద్దరి మధ్య గ్యాప్ ఏం రాలేదు. అనిరుధ్ నాకు చాలా ఇష్టమైన సంగీత దర్శకుడు. తనతో తప్పకుండా పనిచేస్తా.
మిమ్మల్ని మాటల మాంత్రికుడు అంటుంటారు. అది కిరీటం అనుకుంటారా? ముళ్ల కిరీటంలా భావిస్తారా?
ఏమీ అనుకోను. స్టేజీపైకి నన్ను పిలవడానికి యాంకర్లు నాలుగైదు రకాలుగా అభివర్ణిస్తూ పొగుడుతూ పిలుస్తుంటారు. అవేం మొదలెట్టకుండానే స్టేజీపైకి వెళతాను.
అజ్ఞాతవాసి ఎఫెక్ట్ ఎంత పడింది? ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలి అనే కసిని పెంచిందా?
అజ్ఞాతవాసి డిస్ట్రబ్ చేయలేదు అని చెప్పను. కానీ కొంత సేపే. ప్రతి చిత్రం తీసేటప్పుడు ఎంతో కసితోనే తీస్తాం. ఈ సినిమాకీ అలానే అనుకున్నా. కానీ పనిలో పడిన తరవాత.. అవేం పట్టించుకోలేదు. ఓ మంచి సీన్ వచ్చినప్పుడు, ఓమంచి డైలాగ్ రాసినప్పుడు మంచి కిక్ వస్తుంది. నాకు అది చాలు.
మీ స్నేహితుడు పవన్ రాజకీయాల్లోకి వెళ్లిపోయారు… ‘ఇంకొన్ని సినిమాలు చేస్తే బాగుంటుంది కదా’ అని సలహాలేం ఇవ్వలేదా?
సలహాలా.. భలేవారండీ. సలహాలు ఇచ్చేంత సీన్ ఉందా?
పోనీ రాజకీయాల్లోకి వెళ్తున్నప్పుడు మీకేమైనా చెప్పారా?
నాకెందుకు చెబుతారు. ఆయన తన అన్నయ్యకే ఏం చెప్పడు? స్నేహితుడిగా ఆయనతో ఇప్పటికీ టచ్‌లో ఉన్నాను.
ఆయన రాజకీయ ప్రసంగాలన్నీ మీరు రాసిచ్చినవే అంటారు?
నా స్క్రిప్టులు నేను రాసుకోవడానికే బద్దకం ఎక్కువ. ఇక రాజకీయ ప్రసంగాలేం రాస్తాను. నాకూ రాజకీయాలకూ బాగా దూరం. పేపర్లు చదవను. టీవీలు చూడను. ఇక రాజకీయాలేం తెలుస్తాయి?
జగపతి బాబు పాత్రను ప్రేక్షకులు బాగా ద్వేషిస్తారు అని ఫంక్షన్ లో చెప్పారు?
జగపతి గారు ఈచిత్రంలో అహం పూరితమైన ప్రజలు ఎంత దూరమైన వెళ్ళి ప్రతీకారం తీర్చుకుంటారు అనేదే ఆయన పాత్ర బయటపెడుతుంది. నిజమే ప్రేక్షకులు ఈ సినిమా చూసాక ఆయన పాత్రని ద్వేషిస్తారు.
ఈ సినిమాకి సునీల్‌ని మీరే పిలిచారా, తనే అడిగాడా?
సునీల్‌కో మంచి క్యారెక్టర్ ఇవ్వాలని రెండేళ్ల నుంచీ అనుకుంటున్నా. అది ఇప్పుడు కుదిరింది. నేను కూడా తనకు `ముందు హీరోగా నువ్వు చేస్తున్న సినిమాల్ని పూర్తి చేసుకుని ట్రాక్ మార్చుకుని రా అని చెప్పా. తను కూడా హీరోగా కొత్తవి ఒప్పుకోకుండా సిల్లీ ఫెలౌస్ ఒక చిత్రం పూర్తి చేసిన ఈ సినిమా చేసాడు.
ఈ మధ్య వస్తున్న యంగ్ డైరెక్టర్స్ సినిమాలు చూసి మీరు జలసిగా ఫీల్ అవలేదా?
కొంచం జలసిగా ఫీల్ అయినా, వాళ్ళను మెచ్చుకోకుండా ఉండలేను అర్జున్ రెడ్డి, ఆర్.ఎక్స్ 100, రంగస్థలం, గూఢచారి, పెళ్లిచూపులు, కేరాఫ్ కంచరపాలెం.. ఈ సినిమాలు చూసి వాళ్ళ పనితీరు కూడా పరిశీలించాను.
తరవాత మూవీ బన్నీతోనేనా?
ఇంకా డిసైడ్ అవ్వలేదు.. చూద్దాం. ఏం జరుగుతుందో?
హిట్స్ వచ్చినపుడు ప్లాపులు వచ్చినపుడు మీరు ఎలా ఫీలవుతారు?
నేను హిట్లు, ప్లాపులను పట్టించుకోకుండా సినిమాలు తీస్తుంటాను. నేను తీరిక లేకుండా ఎప్పుడు స్క్రిప్ట్ చదవడం, రాయడం లోనే బిజీ గా వుంటాను. ఆ మూమెంట్ లో ఏదైనా ఎక్సయిటెడ్ ఐడియా వస్తే దాన్ని మీదనే పని చేస్తాను తప్పా… మిగితావి పక్కకు పెట్టేస్తాను. అంటూ తన ఇంటర్వ్యూ ముగించారు.