గురువు దారిలో శిష్యుడు తేజ
తేజగా పిలువబడే జాస్తి ధర్మ తేజ తన గురువు రాంగోపాల్ వర్మని ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది. కొత్త నటి నటులతో సెన్సషనల్ హిట్స్ అందించిన తేజ బిగ్ స్టార్స్ తో సరైన హిట్ ఇవ్వలేకపోయాడు. సీత సినిమా ఘోరపరాజయం తరువాత మళ్లీ సినిమా సెట్ మీదకు తీసుకెళ్లడానికి రకరకాల సన్నాహాలు చేసుకుంటున్నారు డైరక్టర్ తేజ. ఒక ప్రాజెక్ట్ అయితే పక్కాగా వుందని వార్తలు అందుతున్నాయి. కానీ కరోనా అడ్డంకి వుండనే వుంది. ఇలాంటి నేపథ్యంలో గురువు ఆర్జీవీ చూపించిన బాటలో ముందు వెళ్లాలని తేజ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. గురువు రామ్ గోపాల్ వర్మ బూతు, సెన్సెషన్ సబ్జెక్ట్ లు తీసుకుని, విడియో క్లిప్ ల మాదిరిగా సినిమా క్లిప్స్ లాంటి మైక్రో సినిమాలు తీసి ఏటిటి లో విడుదల చేస్తున్నారు.
ఇప్పుడు తేజ కూడా ఇదే దారిలోకి వెళ్లున్నారట. ఆయన కూడా శ్రేయాస్ ఇటి లో ఓ థియేటర్ తీసుకుని, అందులో సినిమాలు ప్రదర్శించబోతున్నారు. తేజ తాజాగా సైబర్ క్రైమ్స్, డిజిటలైజేషన్ సమస్యలు వంటి న్యూ పాయింట్లు తీసుకుని, సినిమాలు చేసే సన్నాహాల్లో వున్నట్లు తెలుస్తోంది. అయితే గురువు ఆర్జీవీ మాదిరిగా కాకుండా, కాస్త నిడివి వున్న రెగ్యులర్ జోనర్ లో సినిమాలు తీసి ఏ టి టి లో విడుదల చేస్తారని తెలుస్తోంది.













