అభిరామ్‌ను టార్చర్ చేశానన్న డైరెక్టర్ తేజ
తను కెరీర్ మొదలు పెట్టిన దగ్గర నుంచి ఎక్కువగా కొత్త నటీనటులతోనే సినిమాలు చేస్తున్నాడు సీనియర్ డైరెక్టర్ తేజ. ఇప్పుడు తన తాజా చిత్రం అహింస తో కూడా దగ్గుబాటి అభిరామ్, గీతిక లను టాలీవుడ్ వెండితెరకు పరిచయం చేయబోతున్నాడు. అయితే కొత్త వాళ్లతోనే సినిమాలు చేయడానికి గల కారణాన్ని తేజ వెల్లడించాడు.
కొత్తవాళ్లైతే ఎప్పుడు కావాల్సి ఉంటే అప్పుడు అందుబాటులో ఉంటారని, చెప్పింది వింటారని మాత్రమే తను కొత్త వాళ్లతో సినిమాలు చేస్తానని, దానికి తోడు రెమ్యూనరేషన్ల విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని, వాళ్లని తనకు కావాల్సినట్లు మౌల్డ్ చేసుకుంటానని పేర్కొన్నాడు తేజ. ఇదిలా ఉంటే అహింస ప్రెస్మీట్లో మీరు ఆర్టిస్టులను తెగ కష్టపెడతారట కదా. వారు మీ మాట వినకపోతే కొట్టే వరకు కూడా వెళ్తారట నిజమేనా అని తేజను ప్రశ్నించారు.
దీనికి నేను కొట్టడం మీరు చూశారా అని ఎదురు ప్రశ్నించాడు తేజ. అంతేకాదు విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా అభిరామ్ ను తాను టార్చర్ పెట్టిన మాట నిజమేనని ఒప్పుకున్నాడు. ఆ టార్చర్ ఏంటో కూడా తేజ క్లారిటీ ఇచ్చాడు. అభిమారామ్ ను రోజూ రామానాయుడు స్డూడియో కింద నుంచి కొండపై వరకు సైకిల్ తొక్కమని చెప్పానని, కానీ సినిమాలో మాత్రం ఆ సీన్ ను పెట్టలేదని చెప్పాడు.
ఓ షాట్ తీస్తుంటే అభికు కాలు దెబ్బ తిందని, దాంతో 50 రోజులు షూటింగ్ ఆపేయాల్సి వచ్చిందని, అభి సెట్ అయిన వెంటనే 50 కేజీల బరువుతో కొండ చుట్టూ పరిగెత్తమన్నట్లు తాను చెప్పానని, అభి దాన్ని తూ.చ తప్పకుండా పాటించి రోజూ వీడియో పంపేవాడన్నారు. వాస్తవానికి అభిరామ్ కు ఇవన్నీ చేసే అవసరం లేకపోయినా చేశాడు. తన కష్టం నచ్చే తనతో సినిమా చేశానని తేజ చెప్పుకొచ్చాడు.













