సురేందర్ రెడ్డి ఆవిష్కరించిన ‘ఏడ తానున్నాడో’ ఫస్ట్ లుక్
అభిరామ్, కోమలి ప్రసాద్ జంటగా నటిస్తున్న చిత్రం ఏడ తానున్నాడో. దొండపాటి వంశీకృష్ణ దర్శకత్వంలో తనిష్క మల్టీ విజన్ ప్రొడక్షన్స్ పతాకంపై గుజ్జ యుగంధర్ నిర్మిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ పూర్తయింది. టీజర్‌ని విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను దర్శకుడు సురేందర్‌రెడ్డి చేతులమీదుగా విడుదలైంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ చక్కటి ప్రేమకథా చిత్రమిదని తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో సాత్విక్, కావేరి, శివాజీరాజా, సంజయ్ సర్వరూప్, సుదర్శన్, లావణ్యరెడ్డి, వరలక్ష్మి, ఫణి తదితరులు తారాగణం. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఎ.శ్రీకాంత్, సంగీతం: చరణ్ అర్జున్, ఎడిటింగ్: కుమారన్, నరేష్‌రెడ్డి, సహ నిర్మాత: చింతకుంట్ల శ్రీనివాసరెడ్డి.













