పుష్ప3 ఆలోచనలో సుకుమార్?
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒకే సినిమా స్టోరీని రెండు మూడు పార్టులుగా చెప్పడం ట్రెండ్ అయిపోయింది. బాహుబలితో ఈ ట్రెండ్ మొదలైంది. మొదట్లో బాహుబలి ఒకటే అనుకున్నారు. కానీ తర్వాత దాన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేశారు. ఆ సినిమా రిలీజ్ టైమ్‌లో ఇంకో పార్ట్ కూడా ఉంటుందని పెద్ద పెద్ద డిస్కషన్లే నడిచాయి. కానీ ఇప్పుడైతే దానికి సంబంధించి ఎలాంటి సీక్వెల్ లైన్లో లేదు.
తర్వాత కేజీఎఫ్. కేజీఎఫ్ స్టోరీ రెండు పార్ట్లతో ముగిసినా, మూడో చాప్టర్ గురించి కూడా హింట్స్ వచ్చాయి. ఫ్యూచర్లో మూడో భాగం వచ్చే అవకాశాలు చాలానే ఉన్నాయి. ఇక అసలు విషయానికొస్తే ప్రస్తుతం రెండో పార్ట్ తో రెడీ అవుతున్న పుష్ప మూవీకి మూడో పార్ట్ కూడా ఉంటుందనే ప్రచారం ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది.
ఈ విషయం గురించి పుష్ప యూనిట్ సభ్యుల్లో చర్చ జరగడం, ఆ ప్రచారం బయటకు రావడంతో అందరికీ ఆసక్తి కలుగుతోంది. పుష్పను మొదట్లో ఒక రీజనల్ ఫిల్మ్‌గా మొదలుపెట్టి, ఆ సినిమాతో ఇండియా మొత్తంలో క్రేజ్ తెచ్చుకున్నారు. పుష్ప2 షూటింగ్ మధ్యలో ఉండగా, ఇప్పుడు సుకుమార్‌కు మూడో పార్ట్ తీస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చినట్లు తెలుస్తోంది.
పుష్ప క్యారెక్టర్ జనాలకు విపరీతంగా నచ్చడంతో ఆ క్యారెక్టర్‌ను అక్కడితో వదిలేయకూడదనుకున్న సుకుమార్, దాన్ని మరింత పొడిగించి ఫ్యూచర్లో మరో పార్ట్ కూడా తీయాలనే దిశగా ఆలోచినస్తున్నట్లు టాక్. మరి ఇందులో ఎంత వరకు నిజముంది అనేది తెలియాల్సి ఉంది.













