నిర్మాత వీఇవీకేడీఎస్ ప్రసాద్ ఇక లేరు
అమరం అఖిలం ప్రేమ చిత్ర నిర్మాత వి.ఇ.వి.కె.డి.ఎస్ ప్రసాద్ శనివారం గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన 1967లో కాకినాడలో జన్మించారు. ప్రసాద్‌కు భార్య పద్మజతో పాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌కు అత్యంత సన్నిహితుల్లో ప్రసాద్ ఒకరు. స్నేహితుడి మరణం తనను ఆవేదనకు లోనుచేసిందని సుకుమార్ అన్నారు. ప్రసాద్ నాలో ఎప్పుడూ ఎనర్జీని నింపుతుండేవారు. నాకు సంబందించినంతవరకు అతడి స్థానాన్ని ఎవరు రీప్లేస్ చేయలేరు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. కుటుంబసభ్యులకూ నా ప్రగాఢసానుభూతిని తెలియజేస్తున్నాను అని సుకుమార్ తెలిపారు.













