జక్కన్నను ఫాలో అవుతున్న సుక్కూ
డైరెక్టర్ గా రాజమౌళి తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. మేకింగ్ పరంగా రాజమౌళి ఎంతో పర్ఫెక్షన్ ఉండేలా చూసుకుంటాడు. ఒక సీన్ చేస్తున్నాడంటే ఆ సీన్ తను అనుకున్నట్లు, తనకు నచ్చేటట్లు వచ్చేవరకు ఆర్టిస్ట్ ల ప్రాణం తీసి అయినా మళ్లీ మళ్లీ చేయించుకుంటాడు. అందుకే రాజమౌళి సినిమాలంటే యాక్టర్లంతా భయపడుతుంటారు.
రాజమౌళి ఇంత పర్ఫెక్షన్ను కోరుకోవడం, ఫ్రేమ్ టూ ఫ్రేమ్ లెక్కలేసుకోవడం వల్లే జక్కన్న రెండు మూడేళ్లకో సినిమా మాత్రమే చేయగలుగుతున్నాడు. ఇప్పుడు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కూడా పుష్ప2 విషయంలో ఇంతే పర్ఫెక్షన్ ను కోరుకుంటున్నాడట. పుష్ప1 సినిమాకు నేషనల్ లెవల్ లో క్రేజ్ రావడంతో పుష్ప2ని మరింత బెస్ట్ గా డెలివర్ చేయాలని చూస్తున్నాడట.
దాని కోసం సీన్ కరెక్ట్ గా వచ్చేవరకు టేక్ ల మీద టేక్ లు తీస్తున్నాడట సుకుమార్. అందుకే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికి 20% మాత్రమే పూర్తయిందని టాక్. గత ఆరు నెలలుగా పుష్ప2 షూటింగ్ జరుగుతున్నప్పటికీ ఇంకా 80% షూటింగ్ పెండింగ్ లో ఉందంటే సుకుమార్ పర్ఫెక్షన్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి ఈ షూటింగ్ విషయంలో వస్తున్న వార్తలు నిజమా కాదా అనేది తెలియాల్సి ఉంది.













