Sukumar: సినిమా వదిలేస్తానన్న సుకుమార్
రియల్ లైఫ్ అయినా రీల్ లైఫ్ అయినా కొన్ని విషయాలు మనం సరదాగా కూడా వినడానికి ఇష్టపడం. రీసెంట్ గా అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్(Game Changer Pre Release Event) లో ఇలాంటి సంఘటనే జరిగింది. ఈవెంట్ లో భాగంగా సుమ(Suma) గెస్టుగా వచ్చిన సుకుమార్(Sukumar) ను ఓ ప్రశ్న అడిగింది. జీవితంలో ఏదైనా వదిలేయాల్సి వస్తే మీరు దేన్ని వదిలేస్తారు అని.
దానికి సుకుమార్ వెంటనే సినిమా అని బదులివ్వడంతో ఒక్కసారిగా సుకుమార్ పక్కనే కూర్చున్న రామ్ చరణ్ సైతం షాక్ కు గురయ్యాడు. వెంటనే రామ్(Ram Charan) చరణ్ మైక్ తీసుకుని సంవత్సరం నుంచి ఇదే మాట చెప్తూ భయపెడుతున్నారని, కానీ అలాంటిదేమీ జరగదని హామీ ఇవ్వడంతో ఒక్కసారిగా అందరూ రిలాక్స్ అయ్యారు.
పుష్ప2(Pushpa2)తో ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్ సాధించిన సుకుమార్ మేకింగ్ పరంగా లేట్ చేసినప్పటికీ బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికే తపన పడుతుంటాడు. పుష్ప(Pushpa) లాంటి కమర్షియల్ సినిమాను తీయడానికి ఆయన పడిన కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తుంటుంది. బుచ్చిబాబు(Buchi Babu)తో సినిమా అయ్యాక చరణ్ చేయనున్న సినిమా సుకుమార్ తోనే. రంగస్థలం(Ranga Sthalam) తర్వాత వీరిద్దరి కాంబోలో రానున్న సినిమా కావడంతో అంచనాలు నెక్ట్స్ లెవెల్ లో ఉన్నాయి. 2025 సమ్మర్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్సుంది.













