Sukumar: ఆ సినిమా తర్వాత సినిమాలు ఆపేద్దామనుకున్నా!
టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న సుకుమార్(Sukumar) ఆర్య(Arya) సినిమాతో ఇండస్ట్రీకి డైరెక్టర్ గా పరిచయమయ్యాడు. ఒక ప్రేమ కథను ఇలా కూడా తీయొచ్చా అని సుకుమార్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత రెండో సినిమాగా జగడం(Jagadam) చేశాడు కానీ ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
ఇదిలా ఉంటే సుకుమార్ మహేష్ బాబు(MAhesh Babu) తో 1 నేనొక్కడినే(1Nenokkadine) సినిమా తీసిన విషయం తెలిసిందే. హాలీవుడ్ స్టైల్ లో తీసిన ఆ సినిమాను కొందరు మాస్టర్ పీస్ అంటుంటే, మరికొందరు మాత్రం అసలు సినిమా అర్థం కాలేదంటారు. మొత్తానికి 1 మూవీ బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫ్లాప్ గా మిగిలింది. ఆ సినిమా ఫ్లాప్ అవడంతో తాను సినిమాలు చేయడం ఆపేద్దామనుకున్నట్లు సుకుమార్ రీసెంట్ గా అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్(Game Changer Pre Release Event) లో తెలిపాడు.
1నేనొక్కడినే తర్వాత ఆల్మోస్ట్ సినిమాలు ఆపేద్దామనే పరిస్థితి వచ్చిందని, అమెరికాలో ఆ సినిమా మంచి కలెక్షన్స్ సాధించకపోయి ఉంటే అప్పుడే సినిమాలకు గుడ్‌బై చెప్పేవాడినని సుకుమార్ వెల్లడించాడు. యూఎస్ ఆడియన్స్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని, దానికి అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అని సుకుమార్ ఈ సందర్భంగా తెలిపాడు. సుకుమార్ టాలెంట్ అందరికీ తెలుసని, ఆయన టాలెంట్ వల్లే 1 నేనొక్కడినే యూఎస్ లో ఆడిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.













