యువి క్రియేషన్స్ లో దర్శకుడు సుజీత్ కి హాట్ట్రిక్ మూవీ రాబోతోందా?
రన్ రాజా రన్ సినిమాతో డైరక్టర్ గా తన సత్తా చాటిన సుజిత్ తన సెకండ్ మూవీనే ప్రభాస్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకున్నాడు. బాహుబలి తర్వాత స్టార్ డైరక్టర్స్ నుండి ఆఫర్లు వచ్చినా సుజిత్ తో సాహో సినిమా చేశాడు ప్రభాస్. అయితే సాహో బాలీవుడ్ ఆడియెన్స్ కు నచ్చినా మన ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. డైరక్టర్ సుజిత్ టేకింగ్ పరంగా ఓకే కాని కథ ఇంకాస్త బాగా రాసుకుని ఉండాల్సిందని అన్నారు. ఇదిలాఉంటే సాహో తర్వాత కొద్దిపాటి గ్యాప్ తీసుకున్న సుజిత్ మెగాస్టార్ చిరంజీవితో రీమేక్ సినిమా చేసే ఛాన్స్ వచ్చిందని అన్నారు. కాని చిత్ర బాధ్యతల నుండి సుజిత్ తప్పుకున్నాడు. కారణాలు ఏంటన్నది తెలియదు కాని సుజిత్ చిరు ఆఫర్ వదులుకోవాల్సి వచ్చింది.
అయితే సుజిత్ కు మరో సారి యువి క్రియేషన్స్ వారే అవకాశం ఇస్తున్నట్టు తెలుస్తోంది. తన మొదటి సినిమా హీరో శర్వానంద్ తోనే సుజిత్ థర్డ్ మూవీ కూడా ఉంటుందని అంటున్నారు. రన్ రాజా రన్ సినిమా సూపర్ హిట్ కాగా మరోసారి ఈ ఇద్దరి కాంబినేషన్ రిపీట్ అవుతుంది. మరి సాహోతో నిరాశపరచడంతో సుజిత్ ఈ సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టాడట ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ చేసుకున్న ఈ ప్రాజెక్ట్ త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందని తెలుస్తుంది. సుజిత్ చేసిన రెండు సినిమాలు యువి బ్యానర్ లోనే రాగా హ్యాట్రిక్ సినిమా గా కూడా వారికే చేయడం విశేషం.













