ఇన్స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాజమౌళి
దర్శక ధీరుడు రాజమౌళి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తన సినిమా విషయాలతో పాటు తనకి నచ్చిన సినిమాల గురించి కూడా ట్వీట్స్ చేస్తుంటాడు. ప్రస్తుతం ఆయనకి ట్విట్టర్లో 3.91 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. మరో సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్ ఓపెన్ చేశారు. ఇందులో తొలి పోస్ట్‌గా రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ మూవీ లోగో పోస్టర్, వీడియోని షేర్ చేసాడు. (Instagram Link) ట్విట్టర్ యూజర్ నేమ్‌నే తన ఇన్‌స్టాగ్రామ్‌కి కూడా పెట్టుకున్నాడు రాజమౌళి. ఇందులో ఆయనకి 50.6k ఫాలోవర్స్ ఉన్నారు.













