రిస్క్ చేస్తున్న శ్రీకాంత్
నారప్ప సినిమా తర్వత డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల చాలా బ్రేక్ తీసుకున్న విషయం తెలిసిందే. తర్వాత ఓ యంగ్ ప్రొడ్యూసర్ మేనల్లుడిని వెండితెరకు పరిచయం చేసే బాధ్యత తీసుకున్నాడు. ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ సినిమా అప్డేట్ ఏంటి అని ఆరా తీస్తే షాకింగ్ న్యూస్ తెలిసింది. ఇప్పటికే సినిమా షూటింగ్ మొదలైపోయిందని, షూటింగ్ కూడా తుది దశకు చేరుకుందన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
1980-90 మధ్య సాగే పొలిటికల్ డ్రామా అని, రాజకీయ అంశాలతో ముడిపడిన పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమాను శ్రీకాంత్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ వాతావరణంలో అప్పటి రాజకీయాలెలా ఉండేవి? గోదావరి ప్రాంతంలో ఎలక్షన్స్ టైమ్ లో వాతావరణం ఎలా ఉంటుందనే అంశాల చుట్టూ ఈ సినిమా తిరగనుందని తెలుస్తోంది.
ఇప్పటి వరకు శ్రీకాంత్ అడ్డాల తన సినిమాల్లో కథల విషయంలో ఎలాంటి ఎక్స్పెరిమెంట్లు చేసింది లేదు కానీ ఈ సినిమా విషయంలో మాత్రం కొంత రిస్క్ తీసుకుంటున్నాడట శ్రీకాంత్. స్టోరీ, క్యారెక్టర్స్, స్క్రీన్ ప్లే ఇలా అన్ని విషయాల్లో కొత్తదనం ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట. దీని కోసం భిన్న స్క్రీన్ ప్లే స్ట్రాటజీని కూడా అనుసరించనున్నారట.
అంతేకాదు తను చెప్పాలనుకున్న కథ మొత్తాన్ని కేవలం ఒక భాగంలో మాత్రమే చెప్పలేననుకున్న శ్రీకాంత్, ఈ సినిమాను రెండు పార్టులుగా చిత్రీకరిస్తున్నాడట. మొదటి భాగం షూటింగ్ దాదాపు పూర్తైంది. రెండో భాగం విషయం మొదటి పార్ట్ ఫలితాన్ని బట్టి ఉండనుందని తెలుస్తోంది. ఏదేమైనా శ్రీకాంత్ ఈ సినిమాతో ఓ కొత్త ప్రయోగం చేస్తున్నాడనే చెప్పాలి.













