శంకర్ ఏదోకటి తేల్చాల్సిందే!
డైరెక్టర్ శంకర్ వ్యవహరిస్తున్న తీరు వల్ల రెండు పెద్ద ప్రొడక్షన్ హౌస్లు, ఇద్దరు స్టార్ హీరోలను తెగ ఇబ్బంది పెడుతోంది. మూడేళ్ల క్రితం అనౌన్స్ చేసి రెండు సంవత్సరాలకు పైగా నిర్మాణంలో ఉన్న గేమ్ ఛేంజర్ రిలీజ్ ఎప్పుడు పూర్తవుతుందనేది నిర్మాత దిల్ రాజు కు కూడా తెలియదట. అప్డేట్స్ గురించి అడుగుతుంటే అది డైరెక్టర్ గారి చేతిలో ఉందని స్మార్ట్ గా ఎస్కేప్ అయ్యాడు దిల్ రాజు. ఏప్రిల్ లో ఇండియన్2 రిలీజ్ అవుతుందనుకుంటే రీసెంట్ గా జరిగిన ఓ ఈవెంట్లో అది ఇప్పట్లో ఉండదని కమల్ హాసన్ స్వయంగా చెప్పడంతో ఇప్పుడు కొత్త డౌట్లు వస్తున్నాయి. ఏది నిజమనేది అర్థం కాక ఫ్యాన్స్ తల కొట్టుకుంటున్నారు. డిసెంబర్లో గేమ్ ఛేంజర్ షూటింగ్ పూర్తయినా హ్యాపీగా ఫీల్ అయేందుకు వీల్లేదు.
దానికి కారణం శంకర్ పోస్ట్ ప్రొడక్షన్ కే చాలా టైమ్ తీసుకుంటారని ఎవరూ చెప్పలేం. పైగా ఇండియన్ 2ని రెండు పార్టులుగా తీయాలని ముందు అనుకుని, కథలో కొన్ని ఛేంజెస్ కూడా చేసి, మళ్లీ కమల్ హాసన్ వద్దనడంతో వెనక్కువచ్చారని టాక్. ఈ ఎఫెక్ట్ వల్లే రామ్ చరణ్ చాలా రోజుల పాటూ షూటింగ్ లేక ఖాళీగా ఉండాల్సి వచ్చింది. శంకర్ అర్జెంట్ గా ఏ సనిమాను క్లియర్ చేయాలనేది డిసైడ్ అయితే దేనికి ఎక్కువ టైమ్ ఇవ్వొచ్చనేది క్లారిటీ వస్తుంది. అలా కాకుండా డేట్స్ ఉన్నాయని అందరినీ ఇబ్బంది పెడితే ఏదీ ముందుకు జరగదనే విషయాన్ని శంకర్ గుర్తించాలి. మరి శంకర్ ఏ విషయాన్ని ఎప్పటికి తేలుస్తాడనేది చూడాలి.













