Shankar: ప్రభాస్ కోసం సీరియస్ గా ట్రై చేసిన శంకర్
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) అంటే అందరికీ ఎంతో అభిమానం. జెంటిల్ మ్యాన్ నుంచి ఆయన సినిమాలన్నీ టాలీవుడ్ లో కూడా బ్లాక్ బస్టర్లు అవుతూ వచ్చాయి. శంకర్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడు ఆయనతో సినిమా చేయాలని టాలీవుడ్ స్టార్లంతా ప్రయత్నించారు. అలా ట్రై చేసిన వాళ్లలో చిరంజీవి కూడా ఒకడు.
కానీ ఎవరికీ కుదరలేదు. ఇప్పుడు చిరూ కొడుకు రామ్ చరణ్ శంకర్ తో గేమ్ ఛేంజర్ చేశాడు. జనవరి 10న సంక్రాంతికి కానుకగా ఆ సినిమా రిలీజ్ కానుంది. అయితే రీసెంట్ గా శంకర్ తన తెలుగు ఎంట్రీ ఇంత లేట్ గా జరగడం గురించి మాట్లాడారు. తెలుగు హీరోలతో సినిమా చేయాలని ఎప్పట్నుంచో ట్రై చేస్తున్నట్లు ఆయన తెలిపాడు.
ముందుగా చిరంజీవితో సినిమా చేయాలని గతంలో ట్రై చేసినా కుదరలేదని, తర్వాత మహేష్ బాబు తో సినిమా చేద్దామని ట్రై చేస్తే అదీ వర్కవుట్ కాలేదని, కరోనా టైమ్ లో ప్రభాస్(prabhas) కోసం చాలా సీరియస్ ట్రై చేశానని, స్టోరీ డిస్కషన్స్ కూడా జరిగాయని కానీ అది కూడా కుదరలేదని, చరణ్ తోనే సినిమా చేయాలని రాసి పెట్టి ఉందని అందుకే గేమ్ ఛేంజర్ కార్యరూపం దాల్చిందని శంకర్ వెల్లడించాడు.













