ఎన్టీఆర్ లో ఎన్.శంకర్
ఎన్టీఆర్ బయోపిక్‌లో పలువురు అగ్ర తారలే కాదు, చాలా మంది అగ్ర దర్శకులు కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఎన్కౌంటర్ శంకర్‌గా పేరొందిన ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్ ఈ చిత్రంలో విఠలాచార్యగా కనిపించబోతున్నారు. తెలుగు చలన చిత్ర చరిత్రలో విఠలాచార్యకు గల స్థానం అందరికీ తెలిసిందే. తెలుగు సినిమా చరిత్రలో చిరకాలం గుర్తుండిపోయే చిత్రాలెన్నో రూపొందించిన ఆయన, మహానటుడు ఎన్టీఆర్‌తో అనేక ఆణిముత్యాలు తెరకెక్కించారు. ఎన్టీఆర్ నట జీవితంలో విఠలాచార్యకు గల స్థానాన్ని దృష్టిలో ఉంచుకుని, ఎన్టీఆర్ బయోపిక్‌లో ఆయన పాత్రకు రూపకల్పన చేశారని సమాచారం.













