బుచ్చిబాబు కోసం శంకర్ ప్లానింగ్
రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా మొదలై రెండేళ్లవుతుంది. కానీ ఇప్పటివరకు సినిమా షూటింగ్ పూర్తి కాలేదు. భారతీయుడు2 ను కూడా ఈ సినిమాతో పాటూ పూర్తి చేయాల్సి రావడంతో గేమ్ ఛేంజర్ డిలే అవుతూ వచ్చింది. అయితే తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా షూటింగ్ క్లైమాక్స్ దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.
మరో 50 రోజులు షూట్ చేస్తే గుమ్మడికాయ కొట్టేయొచ్చని శంకర్ టీమ్ చెప్తుంది. అంటే నెక్ట్స్ ఇయర్ మార్చి నాటికి ఈ సినిమా నుంచి చరణ్ ఫ్రీ కానున్నాడని తెలుస్తోంది. ఎంత డేట్స్ అడ్జస్ట్ చేసినా ఈ లోపు చరణ్ మరో సినిమా చేసే అవకాశం లేదంటున్నారు. దీన్ని బట్టి చూస్తే చరణ్ తో బుచ్చి బాబు చేయనున్న సినిమా మార్చి నుంచి స్టార్ట్ చేయొచ్చన్నమాట.
వాస్తవానికి బుచ్చిబాబుతో చరణ్ చేయబోయే సినిమా జనవరి నుంచే మొదలవ్వాలి కానీ గేమ్ ఛేంజర్ వల్ల ఈ సినిమా డిలే అవుతూ వచ్చింది. ఇప్పటికే డిలే అయిన నేపథ్యంలో ఎంత మండే ఎండల్లో అయినా సరే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని చూస్తున్నారట బుచ్చిబాబు, చరణ్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మించనున్న ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కనుందని ఇప్పటికే వార్తలొచ్చాయి.













