స్పిరిట్ మూవీ గురించి సందీప్ రెడ్డి వంగ ఏమన్నాడంటే
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. డిసెంబర్ 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి మూవీ చేస్తున్నాడు ప్రభాస్.
మారుతి దర్శకత్వంలో చేస్తున్న రాజా డీలక్స్ కూడా నెక్ట్స్ ఏడాదిలోనే రిలీజయ్యే ఛాన్స్ ఉంది. ఈ రెండు సినిమాల తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ స్పిరిట్ అనే సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ గతేడాదే వచ్చింది. టీ సిరీస్ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న ఈ సినిమాకు సంబంధించిన ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్స్ రాలేదు.
ప్రస్తుతం యానిమల్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఓ ఇంటర్వ్యూలో స్పిరిట్ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ను ఇచ్చాడు. యానిమల్ రిలీజ్ తర్వాత వెంటనే స్పిరిట్ మూవీ స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. స్పిరిట్‌లో ప్రభాస్ పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నాడు. ఆ పాత్రను సందీప్ రెడ్డి ఎలా డిజైన్ చేశాడన్నది చూడటానికి ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఆసక్తిగా ఉన్నారు.













