తన ప్లానింగ్‌తో పవన్ కు షాకిచ్చిన సముద్రఖని
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో సముద్రఖని దర్శకత్వంలో రానున్న తాజా సినిమా బ్రో ది అవతార్. వినోదాయ సీత్తం కు అధికారిక రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. ఇందులో పవన్ ప్రత్యేక పాత్రలో కనిపిస్తుండగా, సాయి తేజ్‌కు జోడీగా కేతిక శర్మ నటిస్తుంది.
ఈ నెల 28న బ్రో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసి సినిమాకు హైప్ తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్స్. అందులో భాగంగానే మొదట్లో హీరోయిన్ తో, తర్వాత సాయి ధరమ్ తేజ్‌తో, ఇప్పుడు డైరెక్టర్ తో సినిమాను ప్రమోట్ చేయిస్తున్నారు. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఈ సినిమా డైరెక్టర్ సముద్రఖని బిజీగా ఉన్నారు.
ఓ ఇంటర్య్వూలో సముద్రఖని మాట్లాడుతూ, ఈ కథ ముందుకు త్రివిక్రమ్ గారికి చెప్పినప్పుడు తననే హీరోగా చేస్తారా అని అడిగారని, తను కాదని చెప్పడంతో పవన్ కళ్యాణ్ తో చేస్తారా అని అడిగేసరికి తనకు మాటలు రాలేదని తెలిపాడు సముద్రఖని. స్క్రిప్ట్ నెరేషన్ అయ్యాక పవన్ ఎప్పటి నుంచి షూట్ అని అడిగితే రేపటి నుంచే అని ఆన్సర్ ఇచ్చేసరికి పవన్ షాక్ అయ్యాడని, తనకు రెండు మూడు రోజులు టైమ్ కావాలని ఆయన అడిగారని, అప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్ లో పక్కా ప్లానింగ్ తో ఓ సెట్ ను రెడీ చేసినట్లు సముద్రఖని చెప్పుకొచ్చాడు.
బ్రో సినిమా కోసం పవన్ కేవలం 21 రోజులు మాత్రమే వర్క్ చేశారని, కొన్ని రోజులు హాఫ్ డేస్ మాత్రమే వర్క్ చేశారని తెలిపాడు. 50, 60 రోజుల్లో చేయాల్సిన వర్క్ తమ ప్లానింగ్ వల్ల తక్కువ రోజుల్లో పూర్తి చేసినట్లు సముద్రఖని వెల్లడించాడు. ఈ సినిమా కోసం పవన్ ఎంతో కష్టపడ్డారని, ఆయన ద్వారా తెలుగు ప్రేక్షకులకి ఓ మంచి కథ చెప్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని సముద్రఖని అన్నారు.













