సమంత ఆరోగ్యంపై డైరెక్టర్ రాజ్ కామెంట్స్
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) సిటాడెల్(Citadel) వెబ్ సిరీస్ తో నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. రాజ్(Raj) అండ్ డీకే(DK) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్లో వరుణ్ ధావన్(Varun Dhawan) లీడ్ రోల్ లో నటించాడు. ప్రస్తుతం ఈ సిరీస్ ప్రమోషన్స్ లో చిత్ర యూనిట్ ఫుల్ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ రాజ్ సమంత ఆరోగ్యం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
సిటాడెల్ షూటింగ్ టైమ్ లో సమంత ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేసినట్లు డైరెక్టర్ రాజ్ తెలిపాడు. అసలేం జరుగుతుందో తమకు అర్థం అయ్యేది కాదని, కొన్నాళ్ల తర్వాత సమంత మయోసైటిస్ బారిన పడినట్లు తెలిసిందని చెప్పారు. ఎన్నోసార్లు సమంత కోసం తాము సెట్స్ లో వెయిట్ చేసేవాళ్లమని ఆయన తెలిపాడు.
అనారోగ్యం కారణంతో సమంత చాలా లేట్ గా సెట్స్ కు వచ్చేదని, దీంతో ఆమె స్పృహ తప్పి పడిపోయిందా లేదా ఇంకేమైనా అయిందో తెలిసేది కాదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అదే ఇంటర్వ్యూలో హీరో వరుణ్ ధావన్, సమంత వర్క్ కమిట్మెంట్ నెక్ట్స్ లెవెల్ లో ఉంటుందని, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా వాటిని స్ట్రాంగ్ గా ఫేస్ చేసి సమంత షూటింగ్ పూర్తి చేసిందని, సమంత చాలా ప్రొఫెషనల్ గా ఉంటుందని, ఎప్పుడూ ఏదైనా కొత్తగా చేయాలనే ఆలోచనతో ఉంటుందని అన్నాడు. వారు చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.













