పోస్టర్ ను చూసి… సినిమా విడుదల ఆపొద్దు
గతంలో 1940లో ఓ గ్రామం లాంటి సామాజిక సినిమా తీసీ జాతీయ పురస్కారం అందుకున్నా. నేను తీసిన ప్రతి సినిమా సామాజిక సందేశమున్నదే. సమాజానికి చెడు చేయాలని ఏ రోజూ అనుకోలేదు. డిగ్రీ కాలేజ్ కూడా అలాంటి సినిమానే. పోస్టర్ చూసి సినిమా విడుదల ఆపేస్తామనడం న్యాయం కాదు. అభ్యంతరకరంగా ఉన్న పోస్టర్ను తొలగిస్తాం అని డిగ్రీ కాలేజీ దర్శకుడు నరసింహనంది అన్నారు. ఈ సినిమా పోస్టర్లు అభ్యంతరకరంగా ఉన్నాయని విద్యార్థి సంఘాలు, మహిళలు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయడంతో టాస్క్ఫోర్స్ బృందం దర్శకుడితో పాటు పువురిని అదుపులోకి తీసుకున్నారు. దీని గురించి నరసింహనంది ఫిల్మ్ ఛాంబర్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.













