నాగి సింప్లిసిటీకి ఎవరైనా అవాక్కవాల్సిందే!
ఎవడే సుబ్రహ్మణ్యం అనే చిన్న సినిమాతో డైరెక్టర్ గా జర్నీ మొదలుపెట్టిన నాగ్ అశ్విన్ రెండో సినిమా మహానటితో గొప్ప డైరెక్టర్ల జాబితాలోకి జాయినయాడు. ఇప్పుడు తనపై ఉన్న అంచనాలను మరింత మించిపోయేలా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కల్కి 2898ఏడి సినిమా చేస్తున్నాడు. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే అత్యధికంగా రూ.600 కోట్ల బడ్జెట్ తో కల్కి తెరకెక్కుతుంది.
కల్కి కోసం నాగ్ అశ్విన్ ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించాడు. కల్కి నుంచి ఇప్పటివరకు రిలీజైన ప్రోమోలు చూస్తుంటే హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తగ్గని విధగా కనిపిస్తుంది. ఈ సినిమా పాన్ ఇండియా సినిమా అవుతుందని అందరికీ మంచి అంచనాలున్నాయి. ఇంతటి భారీ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ అలియాస్ నాగి బయట మాత్రం ఎంతో సింపుల్ గా ఉంటాడు.
తన డ్రెస్సింగ్ నుంచి మాట తీరు, వ్యవహార శైలి, తన అప్పీయరెన్స్ అన్నీ సింపుల్‌గానే కనిపిస్తాయి. అయితే ఇప్పుడు మరో విషయంలో నాగి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. కల్కి లాంటి భారీ బడ్జెట్ తీస్తున్న నాగి ఓ చిన్న కారేసుకుని హైదరాబాద్ వీధుల్లో తిరుగుతున్నాడు. ఈ రోజుల్లో సక్సెస్ రాగానే లగ్జరీ కార్లలో తిరిగేస్తున్నారు. కానీ కల్కి లాంటి సినిమాను తీసిన నాగి మాత్రం సాధారణమైన ఓ కారులో తిరుగుతున్నాడు. అది కూడా ఎలక్ట్రిక్ కారు. పర్యావరణానికి ఎలాంటి హాని కలగకూడదనే ఉద్దేశంతో నాగి తనకు నచ్చినట్లు ఈ కారును డిజైన్ చేయించుకున్నాడట. ఏదేమైనా నాగి లైఫ్ స్టైల్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది













