భోళా శంకర్.. మెహర్ ఫోకస్ మొత్తం దాని మీదే..
వాల్తేరు వీరయ్య సినిమాతో ఈ ఏడాదిని గ్రాండ్ గా స్టార్ట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ సినిమా వేదాళంకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు భోళా శంకర్ అనే టైటిల్ ను ఇప్పటికే ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో తమన్నా చిరూకు జోడీగా నటిస్తుండగా, కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలి పాత్రలో నటిస్తోంది.
ఈ సినిమాలో చిరంజీవి శంకర్ దాదా ఎంబిబిఎస్ స్టైల్ లో కామెడీ టైమింగ్ తో అలరించనున్నట్లు యూనిట్ సభ్యులు చెప్తున్నారు. భోళా శంకర్ సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ మెయిన్ ప్లాట్ అయినప్పటికీ మెగాస్టార్ తాలుకూ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ని ఫన్ క్రియేట్ చేసేలా తెరకెక్కిస్తున్నాడట మెహర్ రమేష్. గతంలో ఇప్పటివరకు చిరూ కామెడీ చేసిన అన్ని సినిమాలూ మంచి హిట్లుగా నిలిచినవే.
చిరూ కామెడీ టైమింగ్ కి స్పెషల్ ఫ్యాన్స్ ఉన్నారని కూడా చెప్పొచ్చు. గతంలో ఆయన కామెడీ పండించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు తెప్పించినవే. ఇప్పుడు అదే ఫార్ములాని మెహర్ భోళా శంకర్ కోసం వాడుకోబోతున్నాడట. చిరూ తనకు ఇచ్చిన మంచి అవకాశాన్ని ఎలాగైనా వాడుకోవాలని డిసైడైన మెహర్ ఈ సినిమాలో చిరూను మరింత స్టైలిష్ గా చూపించడంతో పాటూ ఆయన కనిపించే ప్రతీ సీన్‌ను చాలా బాగా ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మరి మెహర్ చేసే ప్లాన్ తో భోళా శంకర్ ప్రేక్షకుల్ని ఏ మాత్రం మెప్పిస్తాడో చూడాలి.













