ఆరెక్స్100 హీరోతో పక్కా కమర్షియల్ డైరక్షర్
కెరీర్ మొదట్లో యూత్ ని మాత్రమే ఫోకస్ చేసి సినిమాలు చేస్తూ వచ్చిన మారుతి ఆ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా మెప్పిస్తూ, తన సినిమాలకు మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. యాక్షన్ కి, సరైన ఎమోషన్ ని జోడించి దానికి కామెడీ టచ్ ఇచ్చి స్టోరీ డ్రైవ్ అయ్యేలా చేయడం మారుతికి వెన్నతో పెట్టిన విద్య. అలాంటి మారుతికి మహానుభావుడు తర్వాత ఇప్పటి వరకు సరైన హిట్ పడలేదు.
ప్రస్తుతం గోపీచంద్ తో పక్కా కమర్షియల్ తీస్తున్నాడు మారుతి. ఈ సినిమాలో గోపీచంద్ సరసన రాశీఖన్నా హీరోయిన్ గా నటించనుంది. వెంకీ తో బాబు బంగారం చేసిన చేసిన మారుతి, ఆ తర్వాత శర్వానంద్, నాగచైతన్య, సాయి తేజ్ లాంటి హీరోలతో వరుసగా సినిమాలు చేస్తూ వచ్చాడు. మళ్లీ ఇప్పుడు గోపీచంద్ తో సెట్స్ పైకి వచ్చిన తరుణంలో ఈ సినిమా తర్వాత మారుతి ఎవరిని డైరెక్ట్ చేయనున్నాడనేది ఇప్పుడు అందరికీ ప్రశ్నగా మారింది.
అయితే మారుతి ఈసారి కూడా ఒక యంగ్ హీరోనే సెలెక్ట్ చేసుకున్నాడట. అది మరెవరో కాదు ఆరెక్స్100 తో అందరినీ ఆకట్టుకున్న కార్తికేయ. మారుతి తర్వాతి సినిమా హీరోగా కార్తికేయ పేరే ఇప్పుడు వినిపిస్తుంది. శ్రీ సరిపల్లి డైరక్షన్ లో సినిమా చేస్తున్న కార్తికేయ ఆ సినిమాలో కొత్త లుక్ లో కనిపించనున్నాడు. రీసెంట్ గానే దానికి సంబంధించిన వివరాలతో ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఆ తర్వాత గీతా ఆర్ట్స్2, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించే సినిమా చేయనున్నాడంటున్నారు. ఆ తర్వాత మారుతి తో సెట్స్ పైకి వెళ్లనున్నాడని తెలుస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందనేది అధికారిక ప్రకటన వస్తే కానీ తెలియదు.













