Maruthi: రాజా సాబ్ తర్వాత ఎవరితో మారుతి?
పక్కా కమర్షియల్(Pakka Commercial) సినిమా తర్వాత మారుతి(Maruthi) సడెన్ గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) తో సినిమా చేస్తున్నానని చెప్పి ఒక్కసారిగా అందరినీ షాక్ కు గురి చేశాడు. పక్కా కమర్షియల్ టైమ్ లో తన దగ్గరున్న ఐడియాను మారుతి యువి(UV Creations) నిర్మాతలకు చెప్పాడు. వాళ్లకు ఆ కథ నచ్చడంతో ప్రభాస్ కు చెప్పి ఓకే చేయించారు.
వాస్తవానికి రాజా సాబ్(The Raja Saab) ముందైతే యువి బ్యానర్ లోనే రావాల్సింది కానీ మధ్యలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People Media Factory)కి వెళ్లింది. మొత్తానికి రాజా సాబ్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లి మారుతి అందరికీ షాకిచ్చాడు. ఈ సినిమాపై మొదట్లో ప్రభాస్ ఫ్యాన్స్ చాలా అసంతృప్తిగా ఉన్నారు. కానీ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, మోషన్ పోస్టర్ చూశాక వారిలో సినిమాపై ఆశలు కలిగాయి.
హార్రర్ కామెడీ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నెక్ట్స్ లెవెల్ లో ఉంటుందని అందరూ అంటున్నారు. రాజా సాబ్ హిట్ అయితే మారుతి డైరెక్ట్ గా పాన్ ఇండియా డైరెక్టర్ల లిస్ట్ లో చేరిపోతాడు. ఈ నేపథ్యంలో ఆయన తర్వాతి సినిమా ఎవరితో చేస్తాడనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ మారింది. ప్రస్తుతం తన ఫోకస్ అంతా రాజా సాబ్ పైనే పెట్టిన మారుతి తన తర్వాతి సినిమాను కూడా కచ్ఛితంగా స్టార్ హీరోతోనే చేస్తాడు. అది కూడా పాన్ ఇండియా లెవెల్ లో. మారుతి మనసులో మాత్రం అల్లు అర్జున్(Allu Arjun) తో సినిమా చేయాలనే కోరిక ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాలంటున్నాయి. ఏదేమైనా ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మరికొంత కాలం వెయిట్ చేయక తప్పదు.













