సినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా కొరటాల శివ ఆలోచనలో, పంథాలో మార్పులేదు
రైటర్‌గా ఎన్నో సినిమలకు పనిచేసిన కొరటాల శివ `మిర్చి` సినిమాతో డైరెక్టర్‌గా మారాడు. పగ, ప్రతీకారాలతో రగిలిపోకుండా ప్రేమతో అన్నీ సాధించవచ్చు అనే సందేశంతో రూపొందిన ఈ సినిమా పెద్ద హిట్ అయి డైరెక్టర్‌గా కొరటాలకు మంచి పేరు తెచ్చింది. ఆ సినిమా తర్వాత ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని దాన్ని అభివృద్ధి చేసే హీరో క్యారెక్టర్‌తో సినిమా తీసి ఘనవిజయం సాధించాడు. జనతా గ్యారేజ్, భరత్ అనే నేను… ఇలా కొరటాల చేసిన నాలుగు సినిమాల్లోనూ సామాజిక అంశం కనిపిస్తుంది. తాను ఇవ్వాలనుకున్న సందేశాన్ని ఇస్తూనే ఆడియన్స్‌ని ఆకట్టుకునే పాటలు, ఎంటర్టైన్మెంట్, ఎమోషనల్ సీన్స్‌తో పక్కాగా రెడీ చేసుకుంటాడు కొరటాల. అందుకే సక్సెస్ఫుల్ డైరెక్టర్‌గా విజయాలు సాధిస్తున్నాడు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో `ఆచార్య` అనే మరో మెసేజ్ ఓరియంటెడ్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బేనర్లో రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. గతంలో ఖైదీ నంబర్ 150లో కూడా హీరోయిన్గా నటించిన కాజల్… రామ్‌చరణ్‌తో కూడా కలిసి నటించింది. రాష్ట్రంలోని దేవాలయాలతో పాటు అనేక ఇతర మతపరమైన కార్యకలాపాలకు సంబంధించిన ఎండోమెంట్స్ విభాగానికి చెందిన గవర్నమెంట్ ఆఫీసర్‌గా మెగాస్టార్ ఈ సినిమాలో కనిపించబోతున్నారు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ నిలిపి వేశారు. షూటింగ్‌కి ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ ఇప్పట్లో షూటింగ్ జరిగే అవకాశం లేదు. అయితే అక్టోబర్‌లో సినిమాకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించాలని దర్శకనిర్మాతలు భావించినప్పటికీ ఆచరణలో అది సాధ్యమయ్యే పని కాదని తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్‌తో ఓ సినిమా చెయ్యాలని ప్లాన్ చేసుకుంటున్నాడు కొరటాల. ఈ సినిమాకి `కారణజన్ముడు` అనే టైటిల్‌ను అనుకుంటున్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే కొరటాల ఇప్పుడు నిర్మాతగా కూడా మారుతున్నారు. తన దగ్గర అసోసియేట్‌గా పనిచేస్తున్న కిరణ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ వెబ్‌సిరీస్‌ను నిర్మిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్‌కు స్క్రిప్ట్ కూడా తనే అందిస్తున్నాడు. టినేజ్‌లో ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు ప్రేమలో పడడం వల్ల వారి జీవితాల్లో ఎలాంటి సమస్యలు ఎదురవుతాయనే అంశంతో ఈ వెబ్‌సిరీస్ ఉండబోతోంది. ఇప్పటివరకు తన సినిమాల్లో సమాజంలోని అనేక సమస్యల గురించి చర్చించిన కొరటాల మొదటిసారి యూత్‌కి సంబంధించిన అంశం గురించి సందేశం ఇవ్వబోతున్నాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. సినిమా అయినా, వెబ్‌సిరీస్ అయినా తన పంథాలో మాత్రం ఎలాంటి మార్పులేదు. సినిమా అనే మాధ్యమం ద్వారా జనంలో చైతన్యం తీసుకొచ్చేందుకు తనవంతు కృషి చేస్తున్న దర్శకుడు కొరటాల శివ తప్ప మరొకరు టాలీవుడ్లో మరొకరు లేరంటే అతిశయోక్తి కాదేమో!













