Ritika Nayak: హీరోయిన్ ను అక్క అంటున్న డైరెక్టర్

అశోకవనంలో అర్జున కళ్యాణం(ashokavanam lo arjuna kalyanam), హాయ్ నాన్న(Hi nanna) మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రితికా నాయక్(ritika nayak) ప్రస్తుతం తేజ సజ్జ(Teja Sakka)తో కలిసి మిరాయ్(mirai) అనే సూపర్ హీరో సినిమాలో నటించారు. కార్తీక్ ఘట్టమనేని(karthik Ghattamaneni) దర్శకత్వంలో తెరకెక్కిన మిరాయ్ మరికొన్ని గంటల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రితికా చిత్ర ప్రమోషన్స్ లో చాలా యాక్టివ్ గా పాల్గొంటూ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడిస్తున్నారు.
తనకు సూపర్ హీరోస్ సినిమాలంటే ఇష్టమని చెప్పిన రితికా, మిరాయ్ లో సూపర్ పవర్స్ ఉన్న అమ్మాయిగా కనిపించబోతున్నానని, సినిమాలోని తన క్యారెక్టర్ కీ, రియల్ లైఫ్ లోని క్యారెక్టర్ కు చాలా భిన్నంగా ఉంటుందని, అదే తనకు మిరాయ్ లో పెద్ద ఛాలెంజ్ గా అనిపించిందని రితికా చెప్పుకొచ్చింది. తేజ(teja sajja) చాలా స్వీట్ అని చెప్పిన రితిక, సినిమాపై, యాక్టింగ్ పై అతని డెడికేషన్ చూస్తే ముచ్చటేస్తుందని చెప్పింది.
జగపతిబాబు(jagapati babu), మంచు మనోజ్(manchu manoj), శ్రియా(sirya) లాంటి వారితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా మంచి ఎక్స్‌పీరియెన్స్ అని డైరెక్టర్ కార్తీక్(karthik) తనను అక్క అని పిలిస్తే, తాను అతన్ని తమ్ముడు అని పిలుస్తానని, ఇయర్ తో సంబంధం లేకుండా ఓ రోజు ముందు పుట్టానని కార్తీక్ తనను అక్క అని పిలుస్తాడని చెప్పింది. తనకు యాక్షన్ సినిమాల్లో నటించాలనుందని, ఫిదా(fidaa) సినిమా చూశాక సాయి పల్లవి(sai Pallavi)ని ఇన్సిపిరేషన్ గా తీసుకున్నానని చెప్పింది.