క్రేజీ ఆఫర్ అందుకున్న కన్నడ డైరెక్టర్
సినీ పరిశ్రమలో ఏదైనా సరే వెంటనే జాతకమే మారిపోతుంది. అప్పటివరకు లైమ్ లైట్ లో లేని వాళ్లు ఒక్కసారిగా ఫేమస్ అయిపోవచ్చు. అప్పటి వరకు ఫేమస్ అయిన వాళ్లు లైమ్ లైట్ లో లేకుండా పోవచ్చు. ఇప్పుడు శాండల్‌వుడ్ డైరెక్టర్ హర్ష ని చూస్తే అదే అనిపిస్తుంది. రీసెంట్ గా శివ రాజ్ కుమార్ నటించిన వేద సినిమాకు దర్శకత్వం వహించింది హర్షనే.
ఈ సినిమా కన్నడలో బాగానే కలెక్ట్ చేసింది. సినిమా కమర్షియల్ హిట్ అయింది కూడా. హర్ష గతంలో తీసిన భజరంగి కూడా బ్లాక్ బస్టరే. కానీ దాని సీక్వెల్ మాత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా నిలబడలేకపోయింది. అంతేకాదు నిఖిల్ కుమార్ గౌడతో రారండోయ్ వేడుక చూద్దాం సినిమా రీమేక్ చేసి మంచి హిట్ అందుకున్నాడు. కెరీర్ స్టార్ట్ చేసి 15 ఏళ్లవుతున్నా హర్ష తీసిన సినిమాలు పది మాత్రమే.
తాజా సమాచారం ప్రకారం హర్ష ఓ గోల్డెన్ ఛాన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. రీసెంట్గా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో శివరాజ్ కుమార్, బాలయ్య ఓ సినిమా చేస్తున్నట్లు శివరాజ్ వెల్లడించిన విషయం అందరికీ తెలిసిందే. వీరిద్దరి కాంబోలో రానున్న సినిమాను డైరెక్ట్ చేయనుంది హర్షనేనట. ఈ సినిమా మొత్తం మూడు పార్ట్‌లుగా ఉంటుందని, సెకండ్ పార్ట్‌లో బాలయ్య ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించనున్నారంటున్నారు.
అంతేకాదు, తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ కూడా ఓ కీలక పాత్ర చేయబోతున్నారని, మూడో భాగంలో మరో సీనియర్ స్టార్ హీరో కూడా మెరవనున్నాడని టాక్. ప్రస్తుతం హర్ష దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ లో ఉన్నాడని, అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడానికి కాస్త టైం పట్టేలా ఉందని ఇన్సైడ్ టాక్. ఏదైనా సరే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తే హర్ష నక్క తోక తొట్టినట్లే. టైం బాగుండి సినిమా బాగా పెర్ఫార్మ్ చేస్తే హర్ష స్టార్ డైరెక్టర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.













