మెగా మల్టీస్టారర్ ప్లానింగ్ లో ఆ డైరెక్టర్
ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీస్టారర్ల ట్రెండ్ నడుస్తున్న విషయం విదితమే. చాలా మంది ఇప్పటికే మల్టీస్టారర్ సినిమాలు చేసి ఫ్యాన్స్ ను అలరించారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి ఆర్ఆర్ఆర్ లో నటించి భారీ సక్సెస్ ను అందుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే త్వరలోనే టాలీవుడ్ లో మరో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ రాబోతున్నట్లు తెలుస్తోంది.
అది కూడా మెగా మల్టీస్టారర్ అని సమాచారం. దీనికి సంబంధించి హరీష్ శంకర్ సూపర్ హింట్ ఇచ్చాడు. రీసెంట్ గా ట్విట్టర్ లో చాట్ సెషన్ నిర్వహించిన హరీష్ శంకర్ ను ఓ నెటిజన్ చిరూ, చరణ్ లతో మీరు సినిమా చేస్తారా అని అడిగితే దానికి అదిరిపోయే ఆన్సర్ ఇచ్చాడు హరీష్ శంకర్. చిరు, చరణ్‌తో పాటూ పవన్ కు కూడా యాడ్ చేసుకోవచ్చని తెలిపాడు.
చిరంజీవి, పవన్, చరణ్‌లతో పాటూ మెగా మల్టీస్ స్టారర్ తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నట్లు స్వయంగా తానే హిట్ ఇవ్వడం ఫ్యాన్స్ కు ఫుల్ జోష్ ఇస్తుంది. మెగా హీరోలతో మంచి బాండింగ్ ఉన్న హరీష్ శంకర్ అనుకుంటే ఈ మెగా మల్టీస్టారర్ తెరకెక్కే అవకాశాలు పుష్కలంగానే ఉంటాయి. ప్రస్తుతం హరీష్ శంకర్ పవన్ తో ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తున్నాడు. ఇప్పటికే కొన్ని షెడ్యూల్స్ పూర్తి చేసుకున్నఈ సినిమా షూటింగ్ కు పవన్ రాజకీయాలతో బిజీగా ఉండటంతో బ్రేక్ ఇచ్చారు.













