రైతు సమస్యలపై విజయ్ సేతుపతి పోరు
విజయ్‌సేతుపతి, శృతిహాసన్ జంటగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన చిత్రం లాభం. ఎస్.పి. జననాథన్ దర్శకుడు. బత్తుల సత్యనారాయణ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ నెల 9న విడుదల కానుంది. ఫస్ట్ లుక్‌ను దర్శకుడు బాబీ విడుదల చేశారు. ఇందులో విజయ్ సేతుపతి రైతు సమస్యలపై పోరాడే వ్యక్తిగా కనిపిస్తారు. ఆయన పాత్ర చిత్రణ కొత్త పంథాలో ఉంటుందని, శక్తివంతమైన సామాజిక సందేశంతో ఆకట్టుకుంటుందని నిర్మాత తెలిపారు. జగపతిబాబు, సాయిధన్సిక, కలైయ రసన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: డి.ఇమ్మాన్, రచన-దర్శకత్వం: యస్.పి.జననాథన్. ఛాయాగ్రహణం :రాంజీ.













