మెగా స్టార్ ని డైరెక్ట్ చేసాను అంతకంటే ఏం కావాలి: డైరెక్టర్ బాబీ
మెగాస్టార్ చిరంజీవి తో కలిసి పనిచెయ్యడం నేటి తరానికి ఒక కల. ‘వాల్తేరు వీరయ్య’ లాంటి మాస్ సినిమాతో మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం అందుకున్నాడు డైరెక్టర్ బాబి. అంతకు ముందే రవితేజ పవర్ తో ఈ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చాడు. చిరు అభిమానిగా, మెగా ఫ్యాన్ గా ‘వాల్తేరు వీరయ్య’ సినిమా తీస్తున్నానని ముందే ప్రకటించాడు. దానికి తగ్గట్టుగానే ప్రతి ఫ్రేమ్ లో మెగా బాస్ కోసం బాబి శ్రమించి పని చేశాడు.
ఫస్ట్ తాను చిరంజీవికి ఫ్యాన్ నే అని, తర్వాతే డైరెక్టర్ గా మారానని బాబీ చాల సందర్భాలలో చెప్పుకున్నాడు. ఈ డైరెక్టర్ సినీ జీవితంలో నలుగురు వ్యక్తులు కీలకమని అతడి స్పీచ్ ని బట్టి అర్థమైంది. మొదటిసారి గుంటూరు నుంచి తాను సినీమా ఇండస్ట్రీకి రావడానికి కారణం తన తండ్రి గారేనని తెలిపారు. సినిమా అనే పిచ్చిని నాన్నగారు చిన్నప్పటి నుంచే నూరి పోసారని, ఇంద్ర సినిమా టైమ్ లో హైదరాబాద్ వచ్చి రచయిత చిన్ని కృష్ణ వద్ద అసిస్టెంట్ గా చేరానని తెలిపారు.
నాకు 39 ఏళ్లు వచ్చేసరికి మెగాస్టార్ డైరెక్టర్ ని అయ్యాను, గూగుల్ లో నాకంటూ కొన్ని పేజీలొచ్చాయి. ఐ లవ్ యు..! అన్నారు బాబి. తాను ఈ సినిమా చేసేప్పుడు తన తండ్రి గారు అనారోగ్యంతో ఆగస్టులో మరణించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. తాను సినిమా తీస్తున్నప్పుడు నాన్నగారికి క్రిటికల్ గా ఉందని డాక్టర్లు చెప్పినట్టు బాబి గుర్తు చేసుకున్నారు.
సినిమా ప్రివ్యూ చూశాక ఏమంటారో చిరంజీవి గారు అనుకున్నాను. కానీ , ‘తమ్ముడూ అద్భుతంగా తీశావ్!’ అన్న ఒక మాట నా జీవితానికి ఇది చాలు కదా అనిపించింది. అంతకంటే ఏం కావాలి! అని ఆయన ఎమోషనల్ అయ్యారు. చిరంజీవిని డైరెక్ట్ చేశాను.. ఇంతకంటే ఏం కావాలి? అని కూడా యంగ్ డైరెక్టర్ బాబి ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేసారు.













