ఆ సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తున్న బాబీ
వరుస విజయాలతో మంచి జోష్ లో ఉన్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 109వ సినిమాను డైరెక్టర్ బాబీతో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ముందు నుంచి మంచి అంచనాలున్నాయి. వాల్తేరు వీరయ్య సినిమాతో చిరంజీవికి మంచి హిట్ ఇచ్చిన బాబీ, ఇప్పుడు బాలయ్యతో అంతకుమించి విజయాన్ని అందుకోవాలని చూస్తున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్టవగా, ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్ హీరోయిన్లు కనిపించనున్నారని మొదటి నుంచి వార్తలొస్తున్నాయి. ఇప్పటికే ఊర్వశీ రౌతెలా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటుండగా, మీనాక్షి చౌదరి కూడా ఈ సినిమాలో మరో హీరోయిన్గా నటిస్తుందని ప్రచారం జరుగుతుంది.
ఇక మూడో హీరోయిన్గా ఎవరు నటిస్తారనే విషయంలో ఆసక్తి పెరుగుతుంది. ఇక ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉందని తెలుస్తోంది. ఆ స్పెషల్ సాంగ్‌లో తమన్నా కనిపించనుందని, బాలయ్య తో కలిసి ఆ స్పెషల్ సాంగ్ లో తమన్నా డ్యాన్స్ చేయబోతుందని సమాచారం. గతంలో జై లవకుశలో స్వింగ్ జర అనే స్పెషల్ సాంగ్ చేసి ఆకట్టుకున్న తమన్నా, తర్వాత మహేష్ మూవీలో డాంగ్ డాంగ్ అనే పార్టీ సాంగ్‌లో మెరిసింది. ఇప్పుడు జై లవకుశ సెంటిమెంట్ ను కంటిన్యూ చేస్తూ బాబీ తమన్నాతో స్పెషల్ సాంగ్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది.













