గంటన్నర సినిమాలు ఇండియాలో ట్రెండ్ అవ్వాలి: డైరెక్టర్ అశ్విన్ శరవణన్..
సాధారణంగా ఇండియాలో సినిమాలు రెండున్నర గంటలు లేదా మూడు గంటల నిడివి గలవి ఉంటాయి. గంటన్నర నిడివి గల సినిమాలు హాలీవుడ్ లో తెరకెక్కుతుంటాయి. అవసరం అనుకుంటే మధ్యలో బ్రేక్ ఉంటుంది లేకపోతే కంటిన్యూగా సినిమా రన్నింగ్ లోనే ఉంటుంది. తెలుగు తెరపై ఇలాంటి గంటన్నర డబ్బింగ్ సినిమాలు చాలానే వచ్చాయి. అయితే ఇప్పుడు భారత్ లో ఇదే తరహాలో సినిమాలు రావాలంటున్నారు తమిళ దర్శకుడు అశ్విన్ శరవణన్.
రీసెంట్ గా నయనతార ప్రధాన పాత్రలో అశ్విన్ శరవ శరవణన్ తెరకెక్కించిన “కనెక్ట్” రిలీజవుతుందన్న విషయం తెలిసిందే. హారర్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ , గంటన్నర నిడివితో ఉంటుంది. రానున్న రోజుల్లో ఈ సమయం తోనే సినిమాలు రూపొందిస్తే రోజుకి థియేటర్లలో ఆరు లేదా ఏడు షోలు వేయొచ్చు అని అశ్విన్ అభిప్రాయపడుతున్నారు.
దీని ద్వారా ఆదాయం కూడా పెరుగుతుంది. సినిమా టికెట్టు ధరణి కూడా తగ్గించే వెసులుబాటు ఉంటుంది అని అశ్విన్ అన్నారు. ఈయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ లో ఉన్నాయి. మేకర్స్ ఇలా ఆలోచించడం కూడా మంచిదేనని, దీన్ని సపరేట్ జానర్ గా భావించి సినిమాలు చేస్తే బాగుంటుంది అని నెటిజన్లు అంటున్నారు.
థియేటర్ తో పాటు ఓటీటీ సౌలభ్యత కూడా ఉంది కనుక సినిమాని మార్కెట్ చేసుకోవడానికి ఓటీటీ మంచి వేదికగానూ నిలుస్తుందని భావిస్తున్నారు. స్టార్ హీరోల చిత్రాలు ఏడాదికి ఒకటి మాత్రమే రిలీజ్ అవుతున్నాయి. అందులోనూ రిలీజ్ కి సెలవులు కలిసొచ్చేలా చూసుకుని విడుదలవుతుంటాయి. మిగతా సమయాల్లో థియేటర్లన్నీ ఖాళీగానే ఉంటున్నాయి. రెండున్నర గంటల నిడివి గల సినిమాలకు సక్సెస్ శాతం తక్కువగానే ఉంటుంది. కోట్ల రూపాయాలు ఖర్చు చేసి నిర్మిస్తున్నా కొన్ని సినిమాలకు కనీసం పెట్టుబడి కూడా రావడం లేదు. గంటన్నర నడివి సినిమాలు తీస్తే పెట్టుబడి భారం తగ్గుతుంది.
హిట్ అయిన సినిమాకి డబుల్ ప్రాపిట్ వస్తుంది. ఇప్పటికే యూ ట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ కి మంచి ఆదరణ లభిస్తుంది. విషయం ఉన్న షార్ట్ ఫిల్మ్ ని విస్తరించి సినిమాగానూ రూపొందించి సక్సెస్ అందుకుంటున్నారు. ఆరకంగా చూస్తే దర్శకుడు శరవణన్ ఆలోచన బాగానే ఉంది. దీనికి కార్యరూపం వస్తే మంచి ఫలితాలకు అవకాశం ఉంటుంది. ప్రేక్షకులు కూడా మూడు గంటల సినిమా అంటే బోర్ ఫీల్ అవ్వకుండా ఉంటారు.













