మొత్తానికి జాతిరత్నం డైరక్టర్ క్లారిటీ ఇచ్చేశాడు
గతవారం థియేటర్లలోకి వచ్చిన జాతిరత్నాలు మంచి విజయాన్ని అందుకుంది. కథ లేకపోయినా ఎంటర్టైన్ మెంట్ తో సినిమాను సూపర్ హిట్ చేసుకోవచ్చు నిరూపించాడు డైరక్టర్ అనుదీప్. అలాంటి అనుదీప్ తర్వాతి సినిమా ఏంటా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిన్న మొన్నటి వరకు బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో వైష్ణవ్ తేజ్ తో సినిమా చేయబోతున్నట్లుగా ప్రచారం జరిగింది కానీ ఆ వార్తలు నిజం కాదని డైరక్టర్ అనుదీప్ క్లారిటీ ఇచ్చేశాడు. తాను ఒక యాక్షన్ సినిమా చేయాలనుకుంటున్నట్లు తన తర్వాత సినిమా గురించి స్పష్టత ఇచ్చాడు.
తనను, తన సినిమాను సినిమా జాతిరత్నాలు ఆఫర్ ఇచ్చిన వైజయంతి మూవీస్ బ్యానర్ లోనే తన తర్వాతి సినిమా ఉంటుందని చెప్పుకొచ్చాడు అనుదీప్. జాతి రత్నాలు రిలీజ్ అయ్యాక చాలా మంది నిర్మాతల నుంచి ఫోన్ వచ్చింది. వారందరూ హిట్ కొట్టినందుకు అభినందనలు తెలుపుతూ తమ బ్యానర్ లో సినిమా చేయమని ఆఫర్ చేశారట కానీ తాను మాత్రం వైజయంతీ మూవీస్ బ్యానర్ లోనే మళ్లీ సినిమా చేయాలనుకుంటున్నట్లు, ఆ బ్యానర్ లో చేయడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని చెప్పుకొచ్చాడు. తన దగ్గరున్న కథల్లో నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకుని, ఆ స్క్రిప్ట్ ను డెవలప్ చేయాలని అనుదీప్ చెప్పాడు. మొత్తానికి కొన్నాళ్ల నుంచి అనుదీప్ సినిమా ఎవరితోనా అని రోజుకో వార్త వస్తున్ననేపథ్యంలో అనుదీప్ ఇలా క్లారిటీ ఇవ్వడంతో ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టినట్లయింది.













