Anil Ravipudi: ఎట్టి పరిస్థతుల్లో హిట్ కొట్టాల్సిందే- అనిల్
కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు ఫెయిల్యూర్ లేని డైరెక్టర్ గా అనిల్ రావిపూడి(Anil Ravipudi) ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కమర్షియల్ సినిమాలతో చేసిన ప్రతీ సినిమా హిట్ అందుకోవడం ఒక్క అనిల్ కే దక్కింది. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో సినిమాలు చేయాలని ప్రతీ హీరో ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే వెంకటేష్(Venkatesh), బాలకృష్ణ(Balakrishna)తో సినిమాలు తీసిన అనిల్ త్వరలోనే సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunnam) సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు.
సంక్రాంతి కానుకగా ఆ సినిమా రిలీజ్ కానుంది. అయితే ఇండస్ట్రీలో సక్సెస్ వచ్చిన తర్వాత ఫెయిల్యూర్ ఎదురైతే ఆ డైరెక్టర్ పరిస్థితి ఎలా ఉంటుందో అనిల్ రీసెంట్ గా వివరించాడు. వరుసగా ఎన్ని హిట్లు వచ్చినా ఒక్క ఫ్లాప్ ఎదురైందంటే ఆ డైరెక్టర్ పాతాళానికి పడిపోవాల్సిందేనని, అప్పటివరకు రాసుకుపూసుకుని తిరిగిన వాళ్లు కూడా అతని వైపు చూడరని అన్నాడు.
అంతేకాదు ఇండస్ట్రీలో హిట్స్ ఉంటేనే ఛాన్సులొస్తాయని, లేకపోతే అన్నీ సర్దుకుని వెళ్లిపోవాల్సిందేనని ఇండస్ట్రీలో ఏ రోజు ఎలా ఉంటుందో చెప్పలేమని ఫామ్ లో ఉన్నంత కాలం సినిమాలు చేసుకుంటూ వెళ్లడం తప్ప మరో ఆప్షన్ లేదని అనిల్ రావిపూడి వెల్లడించాడు. అనిల్ చెప్పిన మాటలు ముమ్మాటికీ నిజమే. సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)తో సినిమా చేయనున్నాడు. అతి త్వరలోనే దానిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది.













