వెంకీలో నిర్మాతను చూశానంటున్న అనిల్
హీరోగా వెంకటేష్ స్థాయి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన టచ్ చేయని జానర్ లేదు. ఎలాంటి క్యారెక్టర్ కు అయినా న్యాయం చేయగలిగే వెంకీ అనుకోకుండా హీరో అయినా సరే ఆ తర్వాత వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్టార్ హీరోగా మారాడు. నిర్మాత రామానాయుడు కొడుకుగా ఎంట్రీ ఇచ్చిన వెంకీలో నిర్మాత లక్షణాలు చాలానే ఉన్నాయట.
అవును. నిజమే! ఈ విషయాన్ని స్వయంగా అతనితో రెండు సినిమాలు చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి చెప్పాడు. వెంకటేష్ తో అనిల్ ఎఫ్2, ఎఫ్3 సినిమాలు చేశాడు. అ టైమ్‌లో అనిల్- వెంకీ మధ్య మంచి బాండింగ్ కూడా ఏర్పడింది. వెంకీ గురించి రీసెంట్గా అనిల్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వెంకీ సెట్స్‌లో హీరోలా కాకుండా నిర్మాతలా ఉంటారని చెప్పుకొచ్చాడు.
ఒక నిర్మాతలానే వెంకీ చుట్టూ ఉన్న అందరికీ ప్రేమని పంచుతారు. ఈ రోజు సీన్ ఏంటని ఎప్పుడూ తనను వెంకీ అడిగేవారు కాదని, డైలాగేంటి అని మాత్రమే అడిగేవాడని, సెట్ కు రాగానే అనీల్ అనీల్ అని దీర్ఘం తీసి మరీ పిలిచేవారని, ఆ పిలుపే తనకు ఎంతో కిక్‌ను ఇచ్చిందని, అనవసరపు ఖర్చుని అసలు ఎంకరేజ్ చేయకుండా నిర్మాతలానే ఆలోచిస్తారని అనిల్ వెంకీ గురించి చెప్పుకొచ్చాడు.













