Buchibabu: ఉప్పెనకు నేషనల్ అవార్డు వస్తుందని ముందే నమ్మా
ఉప్పెన(Uppena) సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బుచ్చిబాబు(Buchi Babu) మొదటి సినిమాకే నేషనల్ అవార్డును అందుకున్నాడు. అంతేకాదు, ఆ సినిమాతో రూ. 100 కోట్లు కలెక్ట్ చేసి అందరూ తన గురించి, తన టాలెంట్ గురించి మాట్లాడుకునేలా చేశాడు బుచ్చిబాబు. ప్రస్తుతం బుచ్చిబాబు తన రెండో సినిమాను రామ్ చరణ్(Ram Charan) తో పెద్ది(Peddi) అనే టైటిల్ తో తీస్తున్నాడు.
ఇదిలా ఉంటే రీసెంట్ గా బుచ్చిబాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన ఫ్యామిలీకి తాను సినిమాల్లోకి రావడం ఏ మాత్రం ఇష్టం లేదని అందుకే వారిని ఒప్పించడానికి హైదరాబాద్ వచ్చి ఎంబీఏలో జాయిన్ అయ్యానని, ప్రతీ రోజూ మధ్యాహ్నం వరకు క్లాసెస్ కు వెళ్లి, ఆ తర్వాత సుకుమార్(Sukumar) ఆఫీస్ కు వెళ్లి ఆయనతో కలిసి పలు సినిమాలకు పని చేశానని చెప్పాడు.
గురువు సుకుమార్ వల్లే ఇవాళ తాను ఈ పొజిషన్ లో ఉన్నానని చెప్తున్న బుచ్చిబాబు, ఉప్పెన సినిమాకు నేషనల్ అవార్డు వస్తుందని తాను ముందు నుంచే నమ్మానని, ఆ సినిమా కేవలం తన డెబ్యూ మూవీ మాత్రమే కాదని, ఉప్పెన సొసైటీలోని ఎన్నో నియమాలను ధిక్కరించిందని, రంగస్థలం(Rangasthalam) సినిమా చేస్తున్నప్పుడే ఉప్పెన క్లైమాక్స్ సుకుమార్ సర్ కు చెప్పానని, ఆ క్లైమాక్స్ విని ఆయన షాకయ్యారని బుచ్చిబాబు వెల్లడించాడు.






