Game Changer: గేమ్ ఛేంజర్ కు సుకుమార్ స్టాంప్
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్(Game Changer) ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ స్ట్రీమింగ్ అవ్వకపోయినా అక్కడున్న వేలాది మంది ద్వారా ఎప్పటికప్పుడు ఈవెంట్ లో జరిగిన అప్డేట్స్, వీడియోలు నెట్టింట షేర్ అవుతూనే ఉన్నాయి. రీసెంట్ గా పుష్ప2(Pushpa2)తో బ్లాక్ బస్టర్ అందుకున్న సుకుమార్(Sukumar) ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్టుగా వెళ్లడమే కాకుండా మెగా ఫ్యాన్స్ కు మంచి కిక్కిచ్చే న్యూస్ వెల్లడించాడు.
సుకుమార్ మాటల్ని బట్టి చూస్తుంటే అతను చిరూతో కలిసి గేమ్ ఛేంజర్ ను చూసినట్లు అర్థమవుతోంది. ఫస్టాఫ్ అదిరిపోయిందని, ఇంటర్వెల్ బ్లాక్ బస్టర్ రేంజ్ లో ఉందని, ఫ్యాన్స్ కు ఫ్లాష్ బ్యాక్ గూస్బంప్స్ తెప్పిస్తుందని, క్లైమాక్స్ లో చరణ్(Charan) యాక్టింగ్ కు అవార్డ్ రావడం ఖాయమని గేమ్ ఛేంజర్ గురించి తెగ మోసేశాడు సుకుమార్.
సినిమాను పూర్తిగా చూసి ఉంటే తప్ప సుకుమార్ అంత కాన్ఫిడెంట్ గా చెప్పడు. సుకుమార్ మాటలు విన్నాక ఫ్యాన్స్ ఆనందం మామూలుగా లేదు. దానికి తోడు ఆర్సీ17(RC17) డైరెక్టర్ సుకుమారే. మొత్తానికి గేమ్ ఛేంజర్ గురించి దిల్ రాజు(Dil Raju), శంకర్(Shankar), సుకుమార్, అంజలి(Anjali), ఎస్జె సూర్య(SJ Surya) ఇచ్చిన ఎలివేషన్లు బట్టి చూస్తే గేమ్ ఛేంజర్ లో కంటెంట్ చాలా బలంగా ఉన్నట్లు అర్థమవుతుంది. జనవరి 10న రిలీజ్ కానున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.













