గుంటూరు కారంలో డింపుల్ సాంగ్
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో గుంటూరు కారం సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రెండో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న గుంటూరు కారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రెండు పాటలు కూడా రిలీజ్ అయ్యాయి.
తమన్ సంగీతం అందిస్తున్న గుంటూరు కారంలో ఒక ఐటెం సాంగ్ కూడా ఉందని మొదటి నుంచి ప్రచారం జరుగుతుంది. అయితే ఈ సాంగ్‌ను పూజా హెగ్డే తో చేయించనున్నారని కూడా టాక్ వినిపించింది. కానీ ఆ ఐటెం సాంగ్ ను పూజా చేయడం లేదని తెలుస్తోంది. ఖిలాడీ బ్యూటీ డింపుల్ హయతి ఈ పాట కోసం మహేష్ తో కలిసి కాలు కదపబోతున్నట్లు సమాచారం.
తమన్ ఈ సాంగ్‌ను చాలా క్యాచీగా స్వరపరిచాడని, ఈ సాంగ్ లో మహేష్, డింపుల్ డ్యాన్స్ లు నెక్ట్స్ లెవెల్ లో ఉండబోతున్నాయని యూనిట్ సభ్యులు చెప్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలుండగా, డింపుల్ హయాతి ఐటెం సాంగ్ చేస్తుందన్న వార్తతో ఆ అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. మొదటి రెండు పాటలు అంతగా ఇంప్రెసివ్ గా లేకపోవడంతో గుంటూరు కారం నుంచి తర్వాత వచ్చే సాంగ్‌పై అందరూ మంచి అంచనాలు పెట్టుకున్నారు.













