బాలీవుడ్ షరీఫ్ దిలీప్ కుమార్ కి అస్వస్థత

బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ అస్వస్థత కారణంగా హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. ఈయన గత కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఆదివారం 98 ఏళ్ల ఈ సీనియర్ నటుడిని ఆరోగ్యం క్షీణించడంతో ముంబైలోని పీడీ హిందూజ హాస్పిటల్‌లో చేర్పించారు. దిలీప్‌కుమార్ ఆరోగ్యాన్ని డాక్టర్స్ నితిన్ గోఖలే, నితిన్ పార్కర్ పర్యవేక్షిస్తున్నారు. 1998లో ఖిలా చిత్రం ఈయన నటించిన చివరి చిత్రం.