టాలీవుడ్ స్టార్స్ కు పార్టీ ఇవ్వనున్న దిల్ రాజు
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అందరికీ సుపరిచితుడే. కేవలం పెద్ద హీరోలతో పెద్ద పెద్ద సినిమాలనే కాకుండా చిన్న సినిమాలను కూడా తీస్తూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తుంటాడు దిల్ రాజు. రీసెంట్గా బలగం సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న దిల్ రాజు ప్రస్తుతం రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ సినిమాను నిర్మిస్తున్నాడు.
ఇక అసలు విషయంలోకి వస్తే, దిల్ రాజు మొదటి భార్య చనిపోయాక మూడేళ్ల పాటూ ఒంటరి జీవితాన్ని గడిపి తర్వాత తేజస్విని ని పెళ్లి చేసుకున్నాడు. గతేడాది వీరికి ఓ బాబు కూడా పుట్టాడు. ఇప్పుడు ఆ బాబు ఫస్ట్ బర్త్ డే ను గ్రాండ్ గా చేయాలని దిల్ రాజు ప్లాన్ చేశాడట. ఈ బర్త్ డే పార్టీకి టాలీవుడ్ లోని స్టార్స్ అందరినీ ఆహ్వానించనున్నాడట దిల్ రాజు.
మామూలుగానే సెలబ్రిటీల ఫంక్షన్లకు స్టార్స్ రావడం, వచ్చి ఎంజాయ్ చేయడం సహజం. మరి స్టార్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు ఫంక్షన్ చేస్తే దాదాపు సెలబ్రిటీలందరూ రావడం ఖాయం. ఈ ఫంక్షన్ లో టాలీవుడ్ స్టార్స్ అంతా కలిసి కనిపించే ఛాన్సుంది. త్వరలోనే ఈ ఫంక్షన్ ఎక్కడ జరగనుంది, ఎవరెవరు వెళ్లనున్నారనేది తెలియనుంది.













