ఒకేసారి ఆరు కథలతో మెగాస్టార్ ను ఉక్కిరి బిక్కిరి చేసిన ప్రొడ్యూసర్ దిల్ రాజు?
మెగాస్టార్‌తో సినిమా చేయాలనుందని దిల్ రాజు వెయిట్ చేస్తున్నారట!. అందులో భాగంగా రీసెంట్గా చిరు ని దిల్‌రాజు కలిశారట. అయితే ప్రొడ్యూసర్ దిల్‌రాజు చేసిన పనికి కాసింత చిరంజీవి షాకయ్యారట. ఓ వైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో సినిమా చేస్తున్న దిల్‌రాజుకి మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారో మరి కొంత కాలం వెయిటింగ్లో పెడతారేమో కూడా తెలియటం లేదు. అయితే స్టార్ ప్రొడ్యూసర్‌గా మెగాస్టార్‌తో..సినిమా చేయాలనుందంటూ స్టేజ్‌పై ఓపెన్‌గా రిక్వెస్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు .. ఆయనకు రీసెంట్గా షాకిచ్చారంటూ వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అదేంటంటే, ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఆరు కథలను తీసుకెళ్లి చిరంజీవి ముందు ఉంచారట. ఈ ఆరింటిలో ఏది నచ్చితే దాంతో సినిమా చేస్తానని దిల్‌రాజు చెప్పేశారట. ఇ్పపుడు బాల్ చిరంజీవి కోర్టులో ఉంది.
దిల్‌రాజు చేసిన పనికి కాసింత చిరంజీవి కూడా షాకయ్యారట. మరి ఆరు కథల్లో మెగాస్టార్ ఏ కథతో దిల్ రాజు బ్యానర్లో సినిమా చేస్తారో చూడాలి. . ఓ వైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేస్తున్న దిల్‌రాజుకి మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారో మరి కొంత కాలం వెయిటింగ్లో పెడతారేమో కూడా తెలియటం లేదు. అయితే స్టార్ ప్రొడ్యూసర్‌గా బ్లాక్ బస్టర్ సినిమాలు చేస్తోన్న దిల్‌రాజు ఇప్పటి వరకు చిరంజీవితో సినిమా చేయలేదు. ఎలాగైనా ఆయనతో సినిమా చేయాలని గట్టిగా నిర్ణయించుకుని తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇక చిరంజీవి ప్రోజెక్టుల విషయానికి వస్తే.. ఇప్పుడు చిరంజీవి మూడు సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్లారు. అందులో ముందుగా మోహన్ రాజా దర్శకత్వంలో చేస్తోన్న గాడ్‌ఫాదర్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. దీని తర్వాత బాబీ డైరెక్షన్లో ఓ సినిమా.. మెహర్ రమేష్ దర్శకత్వంలో చేస్తోన్న భోళా శంకర్ సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. ఈ మూడు సినిమాలు తర్వాత మారుతి దర్శకత్వంలో యువీ క్రియేషన్స్ బ్యానర్లో చిరంజీవి ఓ సినిమా చేస్తారనే టాక్ బలంగా వినిపిస్తోంది. మంచి కథతో రమ్మని చిరంజీవి కూడా మారుతి కి సిగ్నల్ ఇచ్చేశారని టాక్.













