బాలయ్యతో పింక్ రీమేక్
నందమూరి బాలకృష్ణతో సినిమా చేసేందుకు గత కొన్ని రోజులుగా ఆసక్తి చూపిస్తున్న ఈ దిశగా మరో అడుగు ముందుకేశారు. తాజా సమాచారం మేరకు ఆయన బాలయ్యతో కలిసి పింక్ అనే హిందీ సినిమాను రీమేక్ చేసే ప్రపోజల్ చేశారు. తమిళంలో అజిత్ పింక్ రీమేక్‌లో నటించాడు. తెలుగులో బాలకృష్ణ అయితే బాగుంటుందని దిల్ రాజు గట్టిగా అభిప్రాయపడుతున్నారు. స్క్రిప్ట్స్‌ను జడ్జి చేయడంలో దిల్‌రాజుకు గల ట్రాక్ రికార్డు దృష్టా బాలయ్య కూడా ఈ ప్రపోజల్ పట్ల సానుకూలంగా ఉన్నారని, ఈ చిత్రానికి వి.వి.వినాయక్ దర్శకత్వం వహించే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.













