Game Changer: గేమ్ ఛేంజర్ ట్రైలర్ లాంచ్కు రేవంత్ రెడ్డి?
ఆర్ఆర్ఆర్(RRR) తర్వాత రామ్ చరణ్(Ram Charan) నుంచి వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్(Game Changer). శంకర్(Shankar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో కియారా అద్వానీ(Kiara Advani), అంజలి(Anjali) హీరోయిన్లుగా నటించారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాను దిల్ రాజు(Dil Raju) భారీ బడ్జెట్ తో నిర్మించారు.
రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు. ఇప్పటికే టీజర్, సాంగ్స్ ను రిలీజ్ చేసిన మేకర్స్, రేపు కొత్త సంవత్సరం కానుకగా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం ఇప్పటికే అనుమతులు తీసుకున్నారని, దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.
ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy), మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ముఖ్య అతిథులుగా రానున్నట్లు తెలుస్తోంది. అయితే రీసెంట్ గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం దిల్ రాజు(Dil Raju) కు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(TFDC) ఛైర్మన్ గా ప్రతిష్టాత్మక పదవిని కట్టబెట్టింది. తర్వాత దిల్ రాజు ఆధ్వర్యంలో సినీ ప్రముఖులు రేవంత్ రెడ్డిన కలిసిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గేమ్ ఛేంజర్ ట్రైలర్ లాంచ్(













