మేనల్లుడి కెరీర్ కోసం దిల్ రాజు ప్రయత్నాలు
తన మేనల్లుడు ఆశిష్ రెడ్డిని స్టార్ హీరోగా సెటిల్ చేయడానికి నిర్మాత దిల్ రాజు చేస్తున్న ప్రయత్నాలు చూస్తే మతి పోవాల్సిందే. ఆశిష్ మొదటి సినిమా రౌడీ బాయ్స్ కే అనుపమ పరమేశ్వరన్‌ను హీరోయిన్ గా, దేవీ శ్రీ ప్రసాద్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకుని గ్రాండ్ గా కెరీర్ ను పరిచయం అయ్యేలా చేశాడు దిల్ రాజు. ఎన్ని చేసినా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బాగా పెర్ఫార్మ్ చేయలేకపోయింది.
దీంతో ఆశిష్ చేస్తున్న రెండో సినిమా సెల్ఫిష్ కు ఏకంగా సుకుమార్ తో స్టోరీ రెడీ చేయించాడు. అంతే కాదు ఈ సినిమాలో హీరోయిన్ గా వైష్ణవి చైతన్యను తీసుకోవడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అంటున్నార. ఇవన్నీ ఒకెత్తయితే శ్రీలీలను ఆశిష్ కు జోడీగా తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడట దిల్ రాజు. ఇంకా కన్ఫర్మ్ కాలేదు కానీ ప్రయత్నాలైతే గట్టిగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.
రౌడీ బాయ్స్ ఆశించిన ఫలితాన్నివ్వకపోయినా మంచి హిట్ పడితే ఆశిష్ కెరీర్ ఊపందుకుంటుందని దిల్ రాజు భావిస్తున్నాడు. ఎలాగైనా ఆశిష్ ను మంచి మార్కెట్ ఉన్న హీరోగా నిలబెట్టాలనేది దిల్ రాజు ఆలోచిన. కానీ ఇవన్నీ చేసినంత మాత్రాన మంచి మార్కెట్ వస్తుందని చెప్పలేం. ఆశిష్ కు ఆ స్థాయి రావాలంటే కచ్ఛితంగా రెండు మూడు మంచి సినిమాలు పడాల్సిందే. అప్పుడే నిర్మాతలు వద్దన్నా తన వెంట పడతారు.













