ఆ డైరెక్టర్‌తో దిల్ రాజు సినిమా?
నిర్మాత దిల్ రాజు(Dil Raju) సినీ నిర్మాణంలోకి రాకముందు డిస్ట్రిబ్యూటర్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే మొదట్లో ఎంతో దెబ్బ తిన్న దిల్ రాజును తిరిగి ట్రాక్ లోకి వచ్చేలా చేసిన సినిమా తొలిప్రేమ(Tholi prema). ఈ సినిమాతో దిల్ రాజు చాలా సార్లు ఎన్నో రకాలుగా లాభపడ్డారు. తనకు ఏదైనా సినిమా వల్ల నష్టమొస్తే తొలి ప్రేమను రీరిలీజ్ చేసి లాభాలందుకున్నట్లు స్వయంగా ఆయనే చెప్పాడు.
అందుకే ఆ సినిమాను, ఆ సినిమా ఇచ్చిన సక్సెస్‌ను దిల్ రాజు అంత తేలికగా మర్చిపోలేదు. అయితే తొలిప్రేమ డైరెక్టర్ కరుణాకరన్(Director Karunakaran)తో దిల్ రాజుకు మంచి అనుబంధముంది కానీ ఇప్పటివరకు వారిద్దరి కలయికలో సినిమా వచ్చింది లేదు. ప్రస్తుతం కరుణాకరన్ ట్రాక్ రికార్డు బాలేదు. దీంతో దిల్ రాజు ఆయనకు ఛాన్స్ ఇవ్వడానికి డిస్కషన్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
కరుణాకరన్ దర్శకత్వంలో ఆశిష్ రెడ్డి(Asish Reddy) హీరోగా సినిమా చేయడానికి దిల్ రాజు కథను రెడీ చేయిస్తున్నాడట. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ వచ్చే ఛాన్సుంది. అప్పుడెప్పుడో 2010లో డార్లింగ్(Darling) సినిమాతో హిట్ కొట్టిన కరుణాకరన్‌కు ఇప్పటివరకు మళ్లీ హిట్ పడలేదు. దీంతో ఆయనకు డైరెక్టర్ గా ఛాన్సులు తగ్గాయి. కానీ దిల్ రాజు మాత్రం ఆయనపై నమ్మకంతో స్టోరీ రెడీ చేసుకోమని ఛాన్స్ ఇస్తున్నాడు. గతేడాదిగా వీరిద్దరి మధ్య ఈ విషయంలో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. కథ ఫైనల్ అవగానే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది.













